కరీంనగర్

సంక్రాంతి-కనుము వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ,జనవరి 15: పట్టణంలో సంక్రాం తి వేడుకలను శనివారం ప్రజలు ఆనంద్సోవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇళ్లముంగిళ్లల్లో రంగవల్లును అందంగా తీర్చిదిద్దారు. పట్టణ ప్రజలు ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.పిండి వంటలు చేసుకొని బందుమిత్రులతో కలసి పండుగ సంబరాలను జరుపుకున్నారు. సౌభాగ్యములిచ్చే నోము పండుగను ముత్తయిదవులు ఘనంగా జరుపుకున్నారు. నోములను నోచుకున్నారు. ముత్తయిదవులు పసుపుకుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరించారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలను పంచిపెట్టారు.

ప్రజలకు అందుబాటులో హాక్ ఐ సేవలు
కరీంనగర్ టౌన్, జనవరి 15: రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పోలీస్ కమీషనరేట్ నిర్మాణమే ప్రభుత్వలక్ష్యమని, ఈదిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టిందని రాష్ట్ర ఆర్దిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోహాక్ ఐ సేవలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ, కమీషనరేట్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హాక్ ఐ సేవలు అందుబాటులో ఉంటాయని, అవసరాలకు అనుగుణంగా సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణల ద్వారా శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని పేర్కొన్నారు. హైద్రాబాద్ మహానగరంలో ఈసేవలకు అత్యధిక గుర్తింపు లభించిందన్నారు. ప్రజలు పోలీస్‌స్టేషన్‌లకు రాకుండా ఆధారాలతో సహా వారి సమస్యలను తెలిపేందుకు అందుబాటులో వచ్చిన అద్భుత అవకాశమే హాక్ ఐ సేవలన్నారు. దీనిపై రూపొందించిన కరపత్రాలను ఆయన ఈసందర్బంగా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దికార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. నగరంలోని ఒకటి, రెండో, మూడో పట్టణ పోలీసులు, అల్పోర్స్ విద్యాసంస్థల ఆవరణలో నూతనంగా ఏర్పాటైన సిసి కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలన్నారు. డిజిపి మంజూరు చేసిన నిధులతో నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లు, అల్పోర్స్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న సిసి కెమెరాలను మంత్రి పరిశీలించారు. అభివృద్దే ప్రాతిపదికగా జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తుందన్నారు. కమీషనరేట్ పరిధిలోని కరీంనగర్, హుజురాబాద్ డివిజన్ల పరిధిలో ఆదర్శ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేస్తామన్నారు. నేరరహిత కమీషనరేట్ నిర్మాణం కోసం పోలీసులు చేపడుతున్న చర్యలకు సహాకారమందించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మన్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మేయర్ రవీందర్‌సింగ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి, ఎసిసి టి.అన్నపూర్ణదేవి,తదితరులు పాల్గొన్నారు.