కరీంనగర్

ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, జనవరి 19: రోడ్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం మండల కేంద్రంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో కలిసి విద్యార్థులు ర్యాలీ నిర్వహించా రు. ఎస్‌ఐ మాట్లాడుతూ లైసెన్స్ లే కుండా వాహనాలు నడుపవద్దని, హెల్మె ట్ ధరించి వాహనాలు నడపాలని ఆ యన మండల ప్రజలను కోరారు. ఈ వారోత్సవాలలో పాల్గోన్న ప్రతీఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి ఐలయ్య యాదవ్, సర్పంచ్ మామిడి సంజీవ్, ఎంపిటిసి కొయెడ భాస్కర్, ఉపసర్పంచ్ బాలరా జు, ఇతర నాయకులు, విద్యార్థులు పా ల్గొన్నారు.
జూలపల్లిలో...
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భా గంగా గురువారం మండలంలోని పె ద్దాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ జ రిగింది. అటోడ్రైవర్లు, యువతకు ట్రా ఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై దేవేందర్, యువత పాల్గోన్నారు.
ఎలిగేడులో...
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ రక్షణగా ఉంటుందని జూలపల్లి ఎస్‌ఐ దేవేందర్ అన్నారు. గురువారం ఎలిగేడు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బిసి కాలనీ మీదుగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, యువకులు, వ్యాపారులు, నాయకులు హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజనర్సయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు నరహరి సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్ రావు, నాయకులు దుర్గయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్‌లో...
ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సారంగాపూర్ ఎస్సై రణదీర్‌కుమార్ వాహనదారులకు అవగాహణ కల్పించారు. గురువారం సారంగాపూర్ మండల కేంద్రంలో హెల్మెట్‌లేని వాహనదారులను ఆపి పాఠశాల విద్యార్థులతో పుష్పగుచ్చం అందించి హెల్మెట్ ధరించాలని సూచించారు. జా తీయ భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులందరికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
మల్లాపూర్‌లో...
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో గురువారం మల్లాపూర్ ఎస్సై సతీష్‌కుమార్ రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ప్రయాణికులు డ్రైవర్లు ఎవరైనా రోడ్డుపై వెల్లేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ తోట శ్రీనివాస్‌తోపాటు వివిధ గ్రామాల స ర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
జగిత్యాలలో...
మార్చి నుండి ప్రతిఒక్కరు విధిగా వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అనంతశర్మ అన్నారు. గురువారం కొత్త బస్టాండ్ సర్కీల్ వద్ద జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ ని బంధనలపై అవగాహన, చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా ఎస్పీ అనంతశర్మ మా ట్లాడుతూ తమ కుటుంబ సంక్షేమం కోసమే పోలీస్ ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. విధిగా ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని సూ చించారు. భారీ వాహనాల్లో వెల్తున్నప్పుటు సీటు బెల్టు ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చాలవరకు యువతే మృత్యువాత పడుతున్నారని, ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోను మాట్లాడకూడదని తెలిపా రు. వాహనం నడుపుతున్నప్పుడు ని బంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదా లు జరగవన్నారు. వాహనం కొనుగో లు చేసినప్పుడే వాహనం వెంట వాహ న షోరూం యాజమానే హెల్మెట్ అం దించేలా నిబంధలు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈసదస్సులో సిఐ కర్ణాకర్‌రావు, ప్రతాప్, ట్రాఫిక్ ఎస్సై రాంనాయక్, తదితరులు పాల్గొన్నారు.