కరీంనగర్

డిఇ సస్పెన్షన్ సరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, ఏప్రిల్ 5: మంత్రి కెటిఆర్ ప్రతిష్టకు తలవంపులు తేచ్చే విధంగా మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన స్కాంపై ఉత్కంఠ వీడడంలేదు. అధికారుల విచారణలు మాత్రం కొనసాగుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన స్కాంపై డిఇ సెస్పెన్షన్ సరే మరి దుర్వినియోగమయిన నిధుల రికవరీ మాటేమిటో అంతుపట్టడంలేదు. గంభీరావుపేట మండల కేంద్రంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే రూ. లక్షల నిధుల డ్రా జరిగి అధికారుల విచారణ అనంతరం ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ రాజ్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేసిన విషయం పాఠకులకు విధితమే. డిఇ సస్పెన్షన్‌కు గురై పది రోజులు దాటుతున్న అధికారులు మాత్రం దుర్వినియోగమయిన నిధుల ఊసేత్తడంలేదు. మండల కేంద్రంలో మొత్తం 834 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, మరుగుదొడ్లు నిర్మించకుండానే మొత్తం మరుగుదొడ్లు పూర్తయినట్లు దాదాపు రూ. 93లక్షలు డ్రా చేశారు. 264 మరుగుదొడ్లు అసలు కట్టకుండానే నిధులు డ్రా చేసి ఖాజేశారు. జరిగిన మరుగుదొడ్ల అవినీతి కుంభకోణంపై వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కుంభకోణ వ్యవహరం భయటపడింది. దీంతో అధికారులు గ్రామంలోని ఇంటింటా సర్వే నిర్వహించి దాదాపు 174 మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విచారణ ద్వారా ఒక నిర్ణయానికి వచ్చారు. తదానంతరం స్కాంకు సంబంధించి ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ రాజ్‌కుమార్‌ను సస్పెండ్, అప్పటి ఎంపిడివోకు షోకాజ్ నోటీస్, సర్పంచ్‌పై చర్యలకు డిపిఓకు ఆదేశాలులిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారిచేశారు. డిఇని సస్పెన్షన్ మాత్రం చేశారు కాని, డ్రా చేసిన నిధుల రికవరి మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక మరుగుదొడ్లు నిర్మించిన కూలి డబ్బులు రావల్సివుందని భవననిర్మాణ కార్మిక సంఘాలు ధర్నా చేయడం కూడా జరిగింది. స్కాం భయటపడిన అనంతరం కార్మిక సంఘాలు ధర్నాకు దిగడంతో తక్షణం వారికి చెల్లించవల్సిన రూ. 7లక్షల్లో రూ.5లక్షలు సర్పంచ్ చెల్లించారు. మరో రూ. 2లక్షలు రావల్సిందని భవన నిర్మాణ సంఘ కార్మికులు అంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలలో ఇంత జరిగినప్పటికి దుర్వినియోగమైన నిధుల రికవరి మాటేమిటని ప్రజలు మాత్రం అదే పనిగా చర్చించుకుంటున్నారు. డిఇ సస్పెన్షన్ తదుపరి రూ. 13లక్షలు బ్యాంక్‌లో జమచేసినట్లు తెలుస్తున్నప్పటికి అధికారులు మాత్రం అధికారికంగా నేటివరకు ప్రకటించలేదు. మొత్తానికి డబ్బులు బ్యాంక్ నందు జమచేసినట్లు తెలుస్తుండి అట్టి డబ్బులు ఎవ్వరి నుండి కట్టించారన్నది మాత్రం తెలియడంలేదు. జమ చేసిన డబ్బుల విషయమై ఎవ్వరికి తొచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ఇక నిధుల దుర్వినియోగానికి ఒక డిఇ మాత్రమే భాధ్యులా ఇందులో మిగతావారి పాత్రేమిలేదాన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సర్పంచ్‌తో పాటు మండల కేంద్రానికి చెందిన కొంత మంది టీఆర్‌ఎస్ నాయకులు డిఇని తప్పుతోవ పట్టించి చివరికి డిఇని బలిపశువును చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలావుండగా, పంచాయతీ తీర్మాణాలు లేకుండానే పంచాయతీకి చెందిన జనరల్ ఫండ్, టిఎఫ్‌సికి చెందిన రూ.30లక్షల నిధులు డ్రా చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు పంచాయతీకి చెందిన రికార్డులను డిఎల్‌పిఓ సిజ్ చేశారు. రికార్డులు సిజ్‌చేసి పదిహేను రోజులుగా అధికారులు లోతుగా రికార్డులను పరిశీలిస్తున్నారు. మండల కేంద్రంలో జరిగిన మరుదుదొడ్ల స్కాంపై కాంగ్రెస్ నాయకులు లోకాయుక్త, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. సమగ్ర విచారణ జరుపవల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారికావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై పునర్విచారణ జరుపుతున్నారు. ఏమిఎమైన నెల రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా మండల కేంద్రంలో జరిగిన మరుగుదొడ్ల స్కాం కంపు ఇప్పటికి చర్చనీయంగానే వుంది.