కరీంనగర్

ప్రభుత్వ రాయితీలతో లబ్ధి పొందండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఏప్రిల్ 28: చేపల పెంపకం కోసం ప్రభుత్వ అందిస్తున్న రాయతీ లను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోలు లచ్చయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా మత్స్యకారుల అవగాహన సదస్సు నిర్వహించగా, వివిధ గ్రామాల నుండి 500 మంది మత్స్యకారులు హాజరయ్యారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన సదస్సును లచ్చయ్య ప్రారంభించగా, ముఖ్యఅతిథిగా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టు ప్రభాకర్ హాజరయ్యారు. చేపల పెంపకంలో చేపలకు వచ్చే జబ్బులు, వాటి నివారణ చర్యలు, వాటి ఆహారపు అలవాట్లు, అదనపు ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు. సదస్సులో జిల్లా సహకార కార్యాలయ సూపరింటెండెంట్ శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ సం ఘాల ఆడిట్ విధానం, క్యాష్ బుక్కు, లెడ్జర్, వాటా ధనం, ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించడంపై అవగాహన కల్పించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి విజయకిరణ్‌కర్ మాట్లాడుతూ ప్రభు త్వ పథకాలు, సభ్యత్వాలు, నూతన సహకార సంఘాల ఏర్పాటు విధానం, జీవో 74 అమలు, చెరువుల విస్తీర్ణం ఆధారంగా వంద శాతం సబ్సిడీ కింద చేప పిల్లల సరఫరా, చేపల రవాణాకు ద్విచక్ర వాహనాల సరఫరాకు యూని ట్ విలువ రూ.40 వేలు సబ్సిడి రూ.30 వేలు లబ్ధిదారుడి వాటా రూ.10 వలే ఉంటుందని తెలిపారు. చేపల రవాణాకు నాలుగు చక్రాల యూనిట్ రూ.4 లక్షలు, సబ్సిడి రూ.3 లక్షలు, లబ్దిదారుడి వాటాధనం రూ.లక్ష ఉంటుందని తెలిపారు. మత్స్యకారులకు కమ్యూనిటి హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తారని, సబ్సిడి కింద రూ.9 లక్షలు, లబ్దిదారుడి వాటా రూ.లక్ష ఉంటుందని వివరించారు. రిజర్వాయర్లలో చేపలు పట్టు మత్స్యకారులకు వలలు, తెప్పలు సరఫరా కొరకు యూనిట్ విలువ రూ.10 వేలు, సబ్సిడి రూ.5 వేలు, లబ్దిదారుడి వాటా ధనం రూ.5 వేలు ఉంటుందన్నారు. ఐస్ బాక్స్‌ల సరఫరాకు యూనిట్ విలువ రూ.4 వేలు, సబ్సిడి రూ.2 వేలు, లబ్ధిదారుడి వాటాదనం రూ.2వేలు ఉంటుందన్నారు. అలాగే చేపల పిల్లల పెంపక చెరువల నిర్మాణం కోసం యూనిట్ విలువ రూ.6 లక్షలు సబ్సిడి రూ.3 లక్షలు, లబ్ధిదారుడి వాటా రూ.3 లక్షలు ఉంటుందన్నారు. చేపల చెరువు ల నిర్మాణం కోసం యూనిట్ రూ. 7 లక్షలు, సబ్సిడి రూ.3.50 లక్షలు, లబ్దిదారుడి వాటాధనం రూ.3.50 లక్షలు ఉంటుందని తెలుపుతూ పలు పథకాలపై అవగాహన కల్పించారు.

బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రవీందర్
మానకొండూర్, ఏప్రిల్ 28: బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మానకొండూర్ మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఉప్పు రవీందర్‌ను నియమించినట్టు జాతీ య సంఘం అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా రవీందర్ మాట్లాడు తూ బిసి సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. అలాగే తన పదవికి సహకరించిన ఆర్. క్రిష్ణయ్యకు, రాష్ట్ర బిసి సంక్షేమ ప్రధాన కార్యదర్శి శ్రీ్ధర్, బిసి యువజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తంగళ్లపల్లి రాజ్‌కుమార్, రేణుక, రణధీర్ సింగ్, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై మాట్లాడారు.
కార్యక్రమంలో పలువురు బిసి సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

బడుగుల ఆరాధ్యదైవం..ఎన్టీఆర్
* నగర టిడిపి అధ్యక్షుడు ఆగయ్య
* జిల్లా కార్యాలయంలో పార్టీ నూతన కార్యవర్గ సమావేశం
ముకరంపుర కరీంనగర్, ఏప్రిల్ 28: బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని నగర టిడిపి అధ్యక్షుడు కల్యాడపు ఆగయ్య కొనియా డారు. పార్టీ నగర నూతన కార్యవర్గ సమావేశం శుక్రవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఆగయ్య అధ్యక్షతన జరిగింది. దీనికి ముందు ఆగయ్య పార్టీ పతాకాన్ని ఎగురవేసి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని పార్టీ నూ తన కార్యవర్గంలో మనందరం ఎన్నికకావడం సంతోషకరమని, బాధ్యతను గుర్తెరిగి కలిసికట్టుగా పనిచేసి, పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో నగర పార్టీ ఉపాధ్యక్షుడు సందబోయిన రాజేశం, ఎస్. కె.సలీం, హయగ్రీవాచా రి, రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి బోలుమల్ల సదానందం, కార్యదర్శులు రవీందర్, వేణుమాధవ్, తదితరులు పాల్గొన్నారు.