కరీంనగర్

అసాంఘిక కార్యక్రమాలకు పిల్లలను దూరంగా ఉంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, జనవరి 2: సమాజానికి వ్యతిరేకంగా జరిగే అసాంఘీక కార్యక్రమాలవైపు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ ఎసీపీ ఉషారాణి అన్నారు. గ్రామసందర్శనలో భాగంగా గంగాధర చౌరస్తాలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎసీపీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామసందర్శన కార్యక్రమం చేపట్టి ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. గంగాధర మండలంలో వెయ్యి సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్యాచరణ ఏర్పాటు చేయగా ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. గ్రామాలలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాలు ఉండడం ద్వారా నేరస్థులను పట్టుకునే వీలు సులభతరం అవుతుందన్నారు. గ్రామాలలో బహిరంగ మద్యం సేవించడం నివారించేందుకు గాను జిల్లా కేంద్రంలో తిప్పుతున్న డ్రోన్ కెమెరాలను గ్రామాలలో తిప్పేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. మద్యం తమ ఇండ్లలోనే తాగాలని, తాగి వాహనాలు నడుపడం వలన ప్రమాదాలు జరిగి వారి కుటుంబాల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని, ప్రమాదాలను నివారించడానికే డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను చేపట్టి పట్టుబడిన వారిని జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. ఆటోలలో కెపాసిటికి మించి ప్రయాణీకులను తీసుకువెళ్లడం వలన ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రయాణం చేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడుపడం ద్వారా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులే బాధ్యత వహించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఆమె అన్నారు. సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేవారిపై రౌడీషీట్స్ తెరుస్తామని, ఒకసారి రౌడీషీట్ ఓపెన్ అవుతే పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సిన అవసరం ఉంటుందని, అటువంటి ఆలోచనలు మానుకోవాలని ప్రజలను కోరారు. గంగాధర చౌరస్తాలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో బృందావన రియల్ ఎస్టేట్ వారు సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.70 వేల చెక్కును ఎసీపీకి అందజేశారు. అలాగే బూరుగుపల్లి చౌరస్తాలో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.60 వేల విరాలాల చెక్కును అక్కడి వ్యాపారులు ఎసీపీకి అందజేశారు. గంగాధర చౌరస్తాలోని విశ్వకర్మ మనుమయ సంఘం నాయకులు సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.10 వేల విరాళాల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి సీఐ రమేష్, స్థానిక ఎస్‌ఐ స్వరూప్ రాజ్, ఎఎస్‌ఐ చంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాంమోహన్ రెడ్డి, కమల, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.