కరీంనగర్

ప్రసవాల్లో మాతా శిశుసంక్షణ కేంద్రానికి మొదటి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మార్చి 21: ప్రసవాలు నిర్వహించటంలో కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలోనగరంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై సెంట్రల్ గుడ్ గవర్నెన్స్ అధ్యయన బృందానికి వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వాస్పత్రులపట్ల ప్రజలకు నమ్మకం లేదని, కానీ 150 పడకలతోమాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన అనంతరం ప్రైవేట్ ఆస్పత్రులవైపు గర్భిణీలు కనె్నత్తి చూడటం లేదన్నారు. అధునాతన శస్త్ర చికిత్స సామాగ్రి, వైద్యులు, సిబ్బందితో 24గంటల పాటు ఉత్తమ వైద్య సేవలందించేలా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈకేంద్రం పనితీరుపై డిఆర్‌డిఏ, మెప్మాలోని స్వశక్తి సంఘాల మహిళల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని కార్పోరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన అధునాతన వైద్య సౌకర్యాలు ప్రత్యక్షంగా చూపుతూ, వారికి అవగాహన కల్పిస్తున్నారు. గర్భం దాల్చిన వెంటనే పిహెచ్‌సిలలో నమోదు చేసుకుని క్రమంగా వైద్య పరీక్షలు నెలవారీగా సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుతూ, సలహాలు, సూచనలు అందజేస్తూ వారి ఆరోగ్యస్థితిని తెల్సుకుంటున్నారని అన్నారు. అధికశాతం సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనిస్తున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే శస్తచ్రికిత్సలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలోనే మొదటి సారిగా ఈకేంద్రంలో మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్సు ప్రారంభించి, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక ప్రసవానికి రూ.30నుంచి రూ.40వేలు ఖర్చవుతుండగా, జిల్లాలో రోజుకు రూ.2.5కోట్ల చొప్పున నెలకు రూ.30కోట్ల వరకు పేదలకు ఆదా అవుతుందన్నారు. కేంద్రంలో 20 పడకల ప్రత్యేక చిన్న పిల్లల కేర్ యూనిట్ ఉందని, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన గర్భిణీలకు కేసీఆర్ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. ఆడపిల్ల తల్లికి రూ.13వేలు, మగబిడ్డ తల్లికి రూ.12వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోందన్నారు. ఈకార్యక్రమంలో కేంద్రం నుంచి వచ్చిన సెంటర్ గుడ్ గవర్నెన్స్ కన్సల్టెంట్ డివి రావు, స్వామి, అసిస్టెంట్ కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రాజేశం, సివిలాస్పత్రి సూపరెండెంట్ డా.సుహాసిని, డిఆర్డీఏ వెంకటేశ్వర్‌రావు,మెప్మా పిడి పవన్, తదితరులు పాల్గొన్నారు.

శాంతి భధ్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సర్చ్
* పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్
పెద్దపల్లి, మార్చి 21: శాంతి భధ్రతల పరిరక్షణ కోసమే కార్డన్ చెర్చ్ చేపడుతున్నట్లు పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయానే్న కాలనీని పూర్తిగా నిర్బంధంలోకి తీసుకొని ఇళ్లు, ఇళ్లు సోదాలు నిర్వహించారు. ద్విచక్రవాహనాలకు సరైన దృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈసందర్బంగా ఏసీపీ హబీబ్‌ఖాన్ మాట్లాడుతూ రామగుండం సీపి విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు ఏవరైన సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే అక్రమంగా గుడుంబా, గుట్కా, మధ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈతనిఖీలలో ట్రేయినింగ్ ఐపీఎస్ అధికారి శరత్‌చంద్ర పవార్, పెద్దపల్లి,సుల్తానాబాద్ సీఐలు నరేందర్, అడ్లూరి రాములు, ఎస్సైలు జగదీష్, రవికుమార్, విజయేందర్, పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.