కరీంనగర్

రూ.112 కోట్లతో తారురోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, ఏప్రిల్ 17: మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిజాతర కోనసాగుతుందని, 112 కోట్ల రూపాయాలతో నియోజకవర్గంలోతారురోడ్ల నిర్మాణం చేపట్టుతున్నామని రాష్టస్రాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం నుంచి వెల్ది, పోచ్చంపల్లి నుంచి మద్దికుంట వరకు తారురోడ్ల నిర్మాణం, అలాగే పచ్చునూర్‌లో మిషన్ కాకతీయ-4 విడుతలో భాగంగా ఎర్రకుంట మరమ్మతు పనులను రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అన్నారం నుంచి రంగపేట గ్రామంమీదుగా వెల్దివరకు 180,00 లక్షలు, పోచ్చంపల్లి నుంచి మద్దికుంట వరకు 135,00 లక్షలతో తార రోడ్ల నిర్మాణం పనులను చెపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పచ్చునూర్‌లో ఎర్రకుంటకు 14లక్షల 67 వేల రూపాయాలతో మరమ్మత్తులను చేయనున్నట్లు తెలిపారు. అన్నారం, రంగపేట, వెల్ది, పోచంపల్లి, మద్దికుంట గ్రామాల ప్రజలు ఎన్నో యేళ్లుగా ఎదురు చూస్తున్న వారి కళలను ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ నేరవేర్చిందన్నారు. వన్నారం నుంచి తాడికల్, గద్దపాక నుంచి కచాపూర్ వరకు బిట్‌రోడ్డు నిర్మాణం పనులను రెండోవిడుతలోతారురోడ్లల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాలుగు యేళ్లలో అనేక అభివృద్ధిని చేసిందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోసిసి రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి క్షణం పాటుపడుతున్నామని గ్రామాల అభివృద్ధికి ప్రజలు సహకారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి లింగయ్య, ఎఎంసీచైర్మన్ మల్లగల్ల నగేష్, వైస్‌ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, సర్పంచ్‌లు గొపు నర్సింహరెడ్డి, ఆరెల్లి సంపత్, రుద్రవరం శ్రీనివాస్, గోపాల్, భూపతి, ఎంపీటీసీలు మల్లేషం, కోల లక్ష్మి-వీరేషం, గోపు మధుసుధన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌లు గోపు ఈశ్వర్‌రెడ్డి, రుద్రవారం సాయికుమార్, నారాయణరెడ్డి, తిరుపతి, మండల అధ్యక్షుడు శేఖర్, మండల వైస్‌ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, పారునంది కిషన్, మానకొండూర్ సోసైటి అధ్యక్షుడు నల్ల వంశీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోపు రవింధర్‌రెడ్డి, కాడారి ప్రభాకర్, రామస్వామి,తదితరులు పాల్గొన్నారు.