కరీంనగర్

మాతృభాషల పరిరక్షణలో ప్రభుత్వాల వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 17: మాతృభాషల అభ్యున్నతికి కృషిచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంగ్ల భాష మాంద్యమానికి చేయూతనిస్తూ, మాతృ భాషల అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రముఖ భాషా శాస్తవ్రేత్త, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ‘అన్ని రంగాలలో తెలంగాణ భాష వినియోగం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలో మాతృ భాషలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. సాఫ్ట్‌వేర్‌లో తెలుగు యూనికోడ్ ఫాంట్‌లను వినియోగించుకొని వివిధ భాషల అనువాదాలను సులభంగా పొందవచ్చునని, ఇందుకోసం పరిశోధనలు తీవ్రంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఆంగ్ల మీడియం బోధన వల్ల మాతృ భాషల్లో సినిమా పరిశ్రమ, పుస్తక రచన వ్యాసాంగాలు, ముద్రణ రంగం దెబ్బతింటుందని, లక్షలాది ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు స్ట్ఫావేర్ నిపుణులు రహమానుద్దీన్ షేక్ మాట్లాడుతూ తెలుగు అంతర్జాలం (నెట్‌వర్క్) ఎంతో ప్రగతి దశలో ఉందని, 40వేల వ్యాసాలు వికెపిటియా తెలుగు విభాగంలో ఉన్నాయని, ఆంగ్లం కన్నా ఎంతో ఎక్కువగా తెలుగు వికెపిటియా వ్యాసాలు ఉన్నాయని, దానిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు ఇమ్మడోలు భద్రయ్య మాట్లాడుతూ తెలుగు భాషలో మాట్లాడాలని, కుటుంబంతోపాటు విద్యాసంస్థలు, పాఠశాలల్లో తెలుగు వినియోగం జరిగినప్పుడే తెలుగు భాష బతుకుతుందని అన్నారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, సాహితీవేత్తలు డాక్టర్ నలిమెల భాస్కర్, గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, టి.రంగస్వామి, సబ్బని లక్ష్మినారాయణ, సంకెపల్లి నాగేంద్రశర్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.