కరీంనగర్

గన్నీ సంచుల కొరతపై రోడ్డెక్కిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్, మే 20: గన్నీ సంచుల కొరతపై సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల రైతుల్లో అగ్రహం వ్యక్తం అవుతుంది. అధికారులు గన్నీ భ్యాగుల కొరతను సృష్టిస్తుండడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాలు చేసి నినసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లె గ్రామానికి చెందిన రైతులు గన్నీ బ్యాగ్‌ల కొరతతో తూకం వేయటంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ జగిత్యాల, సారంగాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తూ వరి ధాన్యం తడిసి ముద్దవుతున్న అధికారులు గన్నీ కొరతను సృష్టిస్తూ పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు చర్యల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారంగాపూర్ ఎస్సై శీలం రాజయ్య రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.

ఇఫ్తార్ విందులు సమైఖ్యతను సూచిస్తాయి: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్, మే 20: ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ పండుగలోని ఇఫ్తార్ విందులు ప్రజల మధ్య సమైఖ్యతను సూచిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆరగించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గంగం మహేశ్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.