కరీంనగర్

కష్టపడి పనిచేసేవారికే పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 20: పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికే గుర్తింపు ఉంటుందని, వారికే ప్రాముఖ్యత ఇవ్వబడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరు పనిచేస్తూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ కరీంనగర్ నియోజకవర్గ సమన్వయ కమిటి సమావేశం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోజిరెడ్డి ముందుగా పార్టీ పతాకాన్ని ఎగురవేసి ఎన్‌టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో జోజిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22న రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్‌లో జరిగే మినీ మహానాడును విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని సూచించారు. కరీంనగర్ నియోజకవర్గ సమన్వయకర్త కల్యాడపు ఆగయ్య మాట్లాడుతూ ఎన్‌టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పూర్వవైభవం కోసం అందరం పాటుపడదామని పిలుపునిచ్చారు. ఐక్యమత్యంతో కలిసి కట్టుగా పార్టీని నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని, 22న జరిగే మినీ మహానాడును విజయవంతం చేసేందుకు అందరు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కొరిటాల శివరామకృష్ణ, బల్సుల శంకరయ్య, ఆకుల కాంతయ్య, గాజె రమేష్, సందెబోయిన రాజేశం, ఆడెపు కమలాకర్, సాయిళ్ల రాజమల్లయ్య, ఎర్రోజు హాయగ్రీవాచారి, నూజెట్టి వాణిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.