కరీంనగర్

ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్గటూరు, జూన్ 19: ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ముంపు గ్రామాలైన తాళ్లకొత్తపేట, చెగ్యాం, రాంనూర్, ఉండెడ, ముక్కట్రావుపేట, కోటిలింగాల ఆయా గ్రామాల ప్రజలతో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ చీఫ్‌విప్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో ముక్కట్రావుపేట గ్రామం ముంపునకు గురవుతున్నట్లు ప్రకటించినప్పటికీ బీసీ కాలనీ ఏర్పాటుకు స్థల సేకరణ విషయంలో జాప్యం కావడం, పరిహారం అందకపోవడం, పెండింగ్‌లో ఉన్నందున ఆ సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. జూలై 15వ తేదీ వరకు ముంపు గ్రామాల్లోని ఆర్ అండ్ ఆర్ కాలనీల సమస్యలు, పరిహారం చెల్లింపు సమస్యలపై ముగ్గురు ప్రత్యేక అధికారులను నియమించి సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేసి అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులు, ఇళ్లు, భూముల పరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్ తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముంపు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్ రావు, జేసీ రాజేశం, ఆర్‌డీఓ నరేందర్, తహశీల్దార్ రాజేష్, ఎంపీడీఓ పురుషోత్తం రావు, సర్పంచ్ గాజుల సతీష్, ఎంపీటీసీ పత్తిపాక వెంకటేష్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ముంపు గ్రామ ప్రజలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
* ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్, జూన్ 19: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా, అభివృద్ధికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పెద్దపీట వేశారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్లిన అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో చేశారన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు వౌలిక వసతులు, ఇతరత్రా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. మళ్లీ ప్రజలు రానున్న రోజుల్లో జరుగనున్న ఎన్నికల్లో కెసిఆర్‌ను అందరు ఆశీర్వదించాలన్నారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో కోటి రూపాయలతో నిర్మించనున్న ఆడిటోరియం, కనె్వన్షన్ భవన నిర్మాణ పనులకు గాను శంకుస్థాపన చేశారు. ఈ ఆడిటోరియం పూర్తయితే యువకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.