కరీంనగర్

ఘనంగా తీజ్ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జూలై 17: గిరిజనుల ఆరాధ్య దైవమైన సీతల గంగాభవాని ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రంగి మండలం మానాల గిరిజన తండాలో, చందుర్తి మండలం సనుగుల గిరిజన తండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ దుస్థులు ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేములవాడ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ గిరిజనుల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సనుగుల సర్పంచ్ శత్రులాల్, పెద్దఎత్తున గిరిజనులు పాల్గొన్నారు.

పర్సన్ ఇన్‌చార్జిలుగా సర్పంచ్‌లనే కొనసాగించాలి
* ఉమ్మడి జిల్లాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్
సుల్తానాబాద్, జూలై 17: ప్రస్తుత సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జిలుగా కొనసాగించాలని ఉమ్మడి జిల్లాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పదవీకాలం ముగిసిపోతుండడంతో ఎన్నికలు జరిగేంత వరకు పర్సన్ ఇంచార్జిలుగా తమనే కొనసాగించాలని, అలాగే కొత్తగా ఏర్పడబోయే మున్సిపాలిటీలకు కూడా తమనే నియమించాలన్నారు. గ్రామాభివృద్ధిలో కీలకంగా పోషించే సర్పంచ్‌లకే తిరిగి అవకాశం కల్పిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యేక అధికారులను నియమించి నాలుగైదు గ్రామాల చొప్పున ఒక్కొక్కరికి అప్పజెప్పడం వల్ల ప్రజలకు న్యాయం జరుగదని, ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. సమస్యలపై ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న సర్పంచ్‌లను నియమించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశించిన బంగారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా రాష్ట్రంలోని సర్పంచ్‌లందరు పాలు పంచుకొని గ్రామ అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఉద్ధేశంతో పూర్తి బాధ్యతగా నిరంతరం కృషి చేసి ప్రజలను మన్ననలు పొందడం జరిగిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ కమిషనర్లకు వినతిపత్రం సమర్పించి సర్పంచ్‌లనే పర్సన్ ఇంచార్జిలుగా కొనసాగించాలని వేడుకోవడం జరిగిందని అంతటి అన్నయ్య గౌడ్ స్పష్టం చేశారు.