కరీంనగర్

‘సంసద్‌‘ సక్సెస్‌కు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జూలై 19: జిల్లాలో సంసద్ గ్రామీణ యోజన పథకాన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకున్నప్పుడే పల్లెలు అన్ని రంగాల్లో ప్రగతి పథం లో పయనిస్తాయన్నారు. జిల్లాలోని ఆదర్శ గ్రామాలుగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల మండలం అంతర్గాం, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ధర్మపురి నియోజక వర్గ పరిధిలోని నేరెళ్ల గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో అమలువుతున్న అభివృద్ధి పథకాలపై గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సమీక్షించుకొని ముందుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి ఇంటింటా సర్వేలు నిర్వహించి ప్రతి వ్యక్తికి సామాజిక, వ్యక్తిగత అవసరాల గురించి తెలుసుకొని గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 15రోజుల ప్రగతికి నివేదికలు వారి స్థాయిలో చూసుకొని పనులు జరిగేలా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ బీ. రాజేశం, డీఆర్‌డీఏ పీడీ అరుణశ్రీ, పీఆర్ ఇఇ ఎస్. మనోహర్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
తండ్రి చితికి కూతరు తలకొరివి
తిమ్మాపూర్, జూలై 19: ఆడదే ఆధారం .. కంటే కూతురునే కనాలి .. ఇవి సినిమా డైలాగ్‌లే కావచ్చు.. కానీ నిజజీవితంలో అక్షరాలా నిజం. అనారోగ్యంతో ప్రా ణాలు కోల్పోయిన తండ్రికి చివరకు కూతురే తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరల్లోకి వెళితే..మండలంలోని నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కొత్త సాయిరెడ్డి (77), లచ్చవ్వ దంపతులకు నలుగురు కూతుర్లు, అందులో పెద్ద కూతురు భారతమ్మ, సుగుణమ్మ, రజిత, సరిత అందరికీ వివాహాలు జరిగాయి. అయతే ఇటీవల తండ్రి సాయిరెడ్డి అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారు జామున మృతిచెందగా, పెద్ద కూతురు భారతమ్మ పెద్ద కొడుకై తండ్రి చితికి తలకొరివి పెట్టింది. సాయిరెడ్డి అంత్యక్రియల్లో బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొడుకైనా, బిడైనా సమానంగా భావించినప్పుడే సత్ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డారు.