కరీంనగర్

మైనారిటీలకు మంచి రోజులొచ్చాయి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 22: మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, వాటి అమలుకు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మైనారిటీలకు మంచి రోజులు వచ్చాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మా నేరు ఫంక్షన్‌హాలులో హజ్ యాత్రకు వెళ్లే ముస్లీం సోదరులకు నిర్వహించిన శిక్షణా శిభిరంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో కలిసి మాట్లాడుతూ ముస్లీంల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రతీయేటా వారి సంక్షేమానికి నిధులు కేటాయించి వాటి అమలుకు ప్ర త్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముస్లీంల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది మైనారిటీలకు స్వర్ణయుగంగా మారబోతుందన్నారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లీం సోదరులు తెలంగాణలో వర్షాలు సంమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అల్లాను ప్రార్థించి ఆకుపచ్చ తెలంగాణ కోసం సహకరించాలని కోరారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లీంలు అనారోగ్యం బారిన పడకుండా ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు పోలియోచుక్కలు వేశారు. మక్కాకు వెళ్లే ముస్లీం సోదరులకు అవసరమయ్యే టోపీ, తస్బీ, ముస్లీం మహిళలకు రూమాల్‌లను బహూకరించి సన్మానించారు. హజ్ కమిటి సభ్యులు ఆరీఫ్ అహ్మద్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రమేష్, కార్పోరేటర్లు బోనాల శ్రీకాంత్, చల్ల హరిశంకర్, బోయినపల్లి శ్రీనివాస్, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.

జర్నలిస్టు హెల్త్ కార్డులకు స్పెషల్ డ్రైవ్
* సమాచారశాఖ ఉపసంచాలకులు వెంకటేశ్వర్‌రావు
ముకరంపుర కరీంనగర్, జూలై 22: జర్నలిస్టు హెల్త్ కార్డులకు స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని సమాచారశాఖ ఉపసంచాలకులు ఎన్.వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లా నుండి 2018 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డులు వుండి, ఇంతవరకు హెల్త్ కార్డులు తీసుకోని జర్నలిస్టులకు ఈనెల 23 నుండి 15 రోజులు తమ పేర్లు తమ కుటుంబ సన్యుల పేర్ల నమోదు కోసం స్పె షల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని, కావున ఎవరైనా జర్నలిస్టులు సమాచార శాఖ ఉపసంచాలకులు మోబైల్ నెంబర్ 9949351691కు ఎస్‌ఎంఎస్ ద్వారా మోబైల్ నెంబరు, మెయిల్, అక్రిడిటేషన్ కార్డు నెంబర్ పంపాలని ఆ ప్రకటనలో తెలిపారు. అట్టి వివరాలు పంపిన జర్నలిస్టులకు యూసర్ ఐడి, పాసువర్డు పంపిస్తామని, వాటిద్వారా ఆన్‌లైన్‌లో వారి పూర్తి వివరాలు నమోదు చేసుకొని హెల్త్ కార్డులు పొందవలసిందిగా ఆయన ఆ ప్రకటనలో వివరించారు.