కరీంనగర్

విజ్ఞానంతోనే ప్రపంచాన్ని జయించిన గొప్ప మేధావి అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూలై 22: విజ్ఞాన ంతోనే ప్రపంచాన్ని జయించిన గోప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. ఆదివారం మానకొండూర్ మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథి గా పాల్గొన్నారు. ముందుగా డప్పు చ ప్పులతో నేతలకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పోలీసుశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి కెమరాలను ఎమ్మెల్యే రసమయి ప్రారంభించారు. ఈసందర్భం గా ఆరుంథతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రసమ యి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్నతనంలోఅనేక అవమానాలు ఎదుర్కొని ఉన్నత చదువు లు చదివి ప్రపంచంలోనే గోప్ప మేధా విగా గుర్తింపుపోందాడని తెలిపారు. అంబేద్కర్ భారత రాజ్యంగాన్ని ర చించి దళితులకు అనేక హక్కులను పొందుపర్చారని తెలిపారు. అంబేద కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారానే ద ళితులు ఉద్యోగాలు సాధించి అర్థికం గా ఎదుగుతున్నారని తెలిపారు. డాక్ట ర్ బిఆర్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. ప్ర తి యువకుడు అంబేద్కర్‌ను స్పూర్తి గా తీసుకుని గొప్పవారుగా ఎదగాల ని తెలిపారు. చదువుకున్నవారినే స మాజంలో గౌరవిస్తారని తెలిపారు. ద ళితులు ఉన్నత చదువులు చదువుకు ంటేనే అర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని, తమ పిల్లలను గొప్పగా చదివించాలన్నారు. దళితులు సహకరిస్తే గ్రామా గ్రామాన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషిచేసానని, విగ్రహ ప్రతిష్టాపన అంటే దేవుడి ప్రతిష్టాపన గా భావిసానని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాలు అవిష్కరణ చేయడం చేతకాని గత పాలకులు విగ్రహాల పేరు తో రాజకీయం చేయడం సిగ్గుచేటనా నరు. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం గురుకుల పాఠశాల ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలో ఒక్కొక్క వి ద్యార్థికి రూ. 1.20 లక్షలను ప్రభు త్వం అందిస్తుందని తెలిపారు. దళితు ల అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ప్రజల మనస్సు గె లుచుకున్నవారికి అపజయం ఉండద ని తెలిపారు. గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీహాల్ భవనం నిర్మాణానికి రూ. 10 లక్షలు, సిసి రోడ్డు నిర్మాణాని కి రూ.10 లక్షలు మంజురు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సుడా చైర్మన్ జీవిఆర్ మాట్లాడుతూ చదువుతోనే పే దరికం పోతుందని ప్రతిఒక్క దళిత యువకులు గొప్పగా చదువుకోవాలని తెలిపారు. మూడు నెలల్లోనే అంబేద కర్ విగ్రహం గ్రామంలో ఏర్పాటు చే యడం గొప్పవిషయమని తెలిపారు. ప్రపంచంలోనే గోప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. అ నంతరం విగ్రహదాత మధుకర్‌ను ప లువురు అభినందించారు. కార్యక్రమ ంలో సర్పంచ్ గాలిపెల్లి వసంత-కొం రయ్య, సిఐ కోటేశ్వర్, గంగాధర త హశీల్దార్ సరిత, ఎంపిడిఓ వెంకట్రాంరెడ్డి, రుద్రవరం శ్రీనివాస్, తాళ్లపల్లి శేఖర్, రామంచ గోపాల్‌రెడ్డి, మల్లగల్ల నగేష్, ఉపసర్పంచ్‌లు ఉమమహేశ్వర్‌రావు, రుద్రవరం సాయికుమార్, పాముల రమణ, విగ్రహ కమిటీ అ ధ్యక్షులు గాలిపల్లి శ్రావణ్, అంజనేయులు, సురేష్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
గంభీరావుపేట, జూలై 22: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పతంజలి యోగా నిర్వాహకులు ఎలిగేటి కృష్ణ అన్నారు. ఆదివారం గంభీరావుపే ట (మం) గజసింగవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా అవశ్యకతపై అవగాహన కల్పించారు. యో గా ద్వారా ఒత్తిడిని దూరం చే యడంతోపాటు, వ్యక్తిత్వ వికా సం, జ్ఞాపకశక్తి పెంపొందిస్తుందన్నారు. యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. పలువురిచే యోగా అభ్యసనం చేయించారు.