కరీంనగర్

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా దాదాపు 40 వేల మంది పంచాయతీల ఉద్యోగులు, కార్మికులు వేతనాల పెంపు, వేతనాలకు గ్రాం టు, పర్మినెంట్, ప్రమోషన్లతో పాటు తదితర డిమాండ్ల సాధనకై జూలై 23న సమ్మెబాట పట్టారు. దీంతో గత 25 రోజులుగా పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో పందులు, దోమలు రాజ్యమేలుతుండగా మురుగు కాల్వల్లో దుర్గంధం వెదజల్లుతోంది. అసలే ఎడతెరిపి లేని వర్షాలతో చెత్తాచెదారం పేరుకుపో యి కంపువాసన భరించలేక అనారోగ్యాలతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. పంచాయతీ కార్మికుల పర్మినెంట్ చేయాలని,కర్ణాటక ప్రభుత్వం తరహాలో వేతన చెల్లింపులకు ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీఓ నెం. 112, 212ను సవరించి అర్హులైన అందరినీ పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గత సమ్మె ఒప్పందాలు అ మలు, 63 జీవోను సవరిస్తామని ప్రభుత్వం దిగివచ్చి జేఏసీతో చర్చలు జరిగితే సమ్మె విరమిస్తామని లేకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె కొనసాగిస్తామని పంచాయతీ ఉ ద్యోగులు, కార్మికులు పట్టుదలతో ఉండగా కార్మిక సంఘ నాయకుల మద్దతుతో పంచాయతీ కార్మిక సమ్మెకు ఉధృతమవుతుంది. గత సమ్మె ఒప్పందాల అమలుకు మోక్షం లేదని, 63జీఓ సీఎం సవరించలేదని రాష్ట్ర జేఏసీ చెప్పే వరకు సమ్మె విరమించబోమని, పంచాయతీ ఉద్యోగ, కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత 25 రోజులుగా సమ్మె సమ్మెబాట పట్టడంతో పల్లె ల్లో పారిశుద్ధ్యం పడకేసింది. 15వ ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు, స్వచ్ఛసర్వేక్షణ్ లాంటి కార్యక్రమాల సక్సెస్ కోసం తమను వాడుకునేందుకే సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ఏఐటీయుసీ, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కెవీ, టీజీపీఇటీ, ఏఐఎఫ్‌టీయు నేతలు సుతారి రాములు, పులి మల్లేశం, గంగమల్లు, ఎన్. లక్ష్మి, రాజలింగం, భరణి, ఎండీ ముఖ్రం, లత, స్వామి, ఎల్లయ్య, సురేష్, లచ్చన్న, చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి నెలకు రూ. 8500 తగ్గకుండా చెల్లించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, పంచాయతీ సమ్మె విరమించి విధుల్లో చేరాలని లేక పోతే తామేం చేయలేమని జిల్లా పంచాయతీ అధికా రి కే. లక్ష్మినారాయణ వెల్లడించారు. అయితే ఇదే విషయమై ప్రభుత్వం దిగివచ్చి జేఏసీతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలుచేస్తే సమ్మె విరమించి విధుల్లో చేరుతామని సమ్మెబాట పట్టిన పంచాయ తీ ఉద్యోగులు, కార్మికులు మొండి పట్టుదల తో ఉన్నారు. తెగేదాక లాగడం మంచిది కాదని పట్టువిడుపులు కూడా పంచాయతీ ఉద్యోగు లు, కార్మికులకు ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి కే.లక్ష్మినారాయణ సూచించగా ప్రభు త్వం గతంలో ఇచ్చిన హామీలకే మోక్షం లేదని, ఇప్పుడిచ్చే హామీలు నిలుపుకుంటారనే గ్యారం టీ ఏమిటని పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా గత జూలై 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది, జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె చేస్తుండడంతో ఎక్కడ చెత్తా అక్కడే పేరుకుపోయి,మురికి కాల్వల్లో దుర్గంధం వెదజ ల్లుతూ పారిశుద్ధ్యం పడకేసింది. దీంతో అంటువ్యాధుల మరింత ప్రబలి పల్లెల్లో ప్రజలు పడకేసే ప్రమాదం లేకపోలేదు. ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించి రాష్టవ్య్రా ప్తంగా సమ్మె చేస్తున్న పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరిపి పరిసరాల పరిశుభ్రత పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.