కరీంనగర్

గోదావరికి భక్తుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 17: ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురిలో నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాల్లో అంతర్భాగంగా మొదటి శుక్రవారం రోజు భక్తులు, యాత్రికులు గోదావరి స్నానాలకై తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రధానంగా తొలి శుక్రవారం పర్వదినంనాడు అనూహ్య రీతిలో వేలాదిమంది భక్తులు క్షేత్రానికి సుదూర ప్రాంతాలనుండి ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలలో అరుదెంచారు. ఉదయాత్పూర్వంనుండే పిల్లాపాపలతో, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, మహా సంకల్పాది పూజలొనరించి, గోదావరి మాత ను అర్చించారు. జీవనదియైన గోదావరి తమను ఎల్లవేళలా కరుణించి, కాపాడాలని భక్తి ప్రపత్తులతో అర్థించారు. పర్వకాలంలో మహిళలు పెద్దసంఖ్యలో ముత్తయిదువులకు వాయినాలను సమర్పించుకున్నారు. మహాసంకల్పాలు, దాన ధర్మాది సత్కర్మలను ఆచరించారు. మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి పౌరోహితుల ఆధ్వర్యంలో తమ గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు, మహా సంకల్పాదులను వేదోక్త సాంప్రదాయాచరణ ప్రకారం ఆచరించారు. అనంతరం దైవ దర్శనాల కొరకు ప్రధానాలయాల ముందు బారులు తీరి వేచి ఉండి, ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దైవ దర్శనాలు చేసుకుని ప్రత్యేక గోత్ర నామయుక్త పూజలను గావించుకున్నారు. దేవస్థానంలోని ప్రధానాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు గావించారు. దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తల మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశశర్మ, ముత్యాల శర్మ, అర్చక పురోహితులు, అర్చకులు ప్రత్యేక సాంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించారు.

కార్మికుల బతుకులు మారటం లేదు
* ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ రావు
సుల్తానాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వాలు, పాలకులు మారినా కార్మికుల బతుకులు మారటం లేదని, కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త ప్రచార యాత్రలో భాగంగా శుక్రవారం ప్రచార రథయాత్ర సుల్తానాబాద్‌కు చేరుకోగా, జిల్లా నేత కడారి సునీల్ ఆధ్వర్యంలో కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రత్నాకర్ రావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఉపాధి హక్కులకై ఏఐటీయూసీ పోరాడుతోందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో శ్రమజీవులు వెట్టిచాకిరీకి గురవుతున్నారని, టీఆర్‌ఎస్ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను, కార్మికులను భ్రమలకు గురి చేస్తుందని, రాష్టవ్య్రాప్తంగా కార్మికులను చైతన్యం చే యడానికి ప్రచారయాత్రలు ఎంతగా నో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు ఉద్యోగభద్రతతో పాటు అన్ని హక్కులను కల్పించాలని రత్నాకర్ రా వు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీ ల్, నల్ల శ్రీనివాస్, రమేష్, అశోక్, వెంకటేష్, మల్లేష్, మహిళా కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.