కరీంనగర్

కేసీఆర్ నియంత పాలనపై దరువేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 18: ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఆశయాలను నెరవేర్చలేని కేసీఆర్ నియంత పాలన పై ఆటపాటల ద్వారా దరువేస్తామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల ఆగడాలను ఆటపాటల ద్వారా ఎండగట్టి తెలంగాణ సాధించుకున్న మాదిరిగానే దొరల, కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ దమనకాండపై ప్రజల్లోకి తీసుకెళ్లిందుకు ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగానే ఉద్యమానికి ఊపిరిలూదిన, ప్రేరణ, స్ఫూర్తినిచ్చిన కరీంనగర్ నుంచే ధూంధాం ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయలేక, చేతకాక తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనపై అక్టోబర్ 1న సాయంత్రం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో కళాకారుల భాగస్వామ్యంతో ధూం ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు సర్కస్ మైదానం నుంచి ఎస్సారార్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చె ప్పారు. కార్యక్రమానికి అధిక సంఖ్య లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఇన్నయ్య పిలుపునిచ్చారు. ధూంధాం నిర్వహకుడు కిషోర్‌తోపాటు నాగరా జు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ప్రజల బతుకులు ఆగమయ్యాయని, తెలంగాణ ఆకాంక్షల కోసం ఈ ధూం ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ర్యాలీలో రెండు వేల మంది అన్ని రకాల కళాకారులు పాల్గొంటున్నారని, ఏవూరి సోమన్న, దరువు ఎల్లన్న, రమాదేవిలతోపాటు పలువురు హాజరవుతారని అన్నారు. చెల్లాచెదురైన కళాకారులంతా అక్టోబర్ 1న ఏకమవుతున్నారని, కేసీఆర్ పాలనపై ఇక దరువేస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో పా ల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు, నేతలు నరహరి జగ్గారెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, వెంకటమల్ల య్య, స్రవంతి, సులోచనారెడ్డి, పుష్పలత, మహిపాల్‌రెడ్డి, మొగురం రమేష్ పలువురు పాల్గొన్నారు.

11 కుండలాలతో గణేశ హవణం
* సతీసమేతంగా హాజరైన భక్తులు
జగిత్యాల, సెప్టెంబర్ 18: కొలిచే భక్తులకు కొంగుబంగారంగా నిలిచే గణేశ హవణం లోక కల్యాణార్థం 11 కుండలాలతో జిల్లా కేంద్రమైన జగిత్యాల శ్రీగణేశ రెసిడెన్సియల్ సంక్షేమ మండల ఆధ్వర్యంలో మంగళవారం సతీసమేతంగా భక్తులు హాజరై ఎల్‌జీ గార్డెన్‌లో ప్రతిష్టించిన వినాయక మండలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అందరినీ చల్లంగా ఉండేలా చూ డు స్వామంటూ వినాయకున్ని వేడుకున్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వేదోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండడంతో పాటు ఇందులో భాగంగానే లోక కల్యాణార్థం 11కుండలాలతో గణేశ హవనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదోక్తంగా నిర్వహించి న ఈ వేడుకల్లో ఆ కాలనీకి చెందిన వారంతా పాల్గొని భక్తిప్రపత్తులతో వినాయకున్ని కొలిచారు. నాగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, ముత్యాల రాంలింగారెడ్డి, మురళి, వంగల భాస్కర చారి, కమటాల రవీందర్, వి. రంగారావు, కొక్కుల రమేష్, తవుటు రాంచంద్రం, వెంకటరామారావు, అంజిరెడ్డి, పన్నాల లింగారెడ్డి, వంగల రామకృష్ణ, ఆకుల సత్యనారాయణ, ఏ. సత్యనారాయణ, జలంధర్‌రావు, జమన్న, కొలగాని వెంకన్న, చెట్‌పల్లి రవీందర్, పోచంపల్లి కొమురయ్య, అంజిత్‌రావు, మోటూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.