కరీంనగర్

బతుకమ్మ చీరల పూర్తి లక్ష్యానికి సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 20: రానున్న 20 రోజుల్లో నిర్దేశిత బతుకమ్మ చీరల పూర్తి లక్ష్యాన్ని సాధించేందుకు మ్యా క్స్ సంఘాలు, చిన్న తరహా పవర్ లూం పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమ అ నుబంధ సంఘాల ప్రతినిధుల సం ఘాలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ వెంకట్రామరెడ్డి కోరారు. ఆ దిశగా అన్ని అసోసియేన్‌లు లక్ష్య సాధనకు తమ వంతు సంపూర్ణ సహకారం అందించేందుకు ముందుకు రా వడం అభినందనీయమన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘బతుకమ్మ చీరల ప్రగతి’పై కలెక్టర్ మ్యాక్స్, ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు, పాలిస్టర్, కాటన్ అసోసియేషన్, టెక్స్‌టైల్ పార్కు, సైజింగ్, వైపని, వార్పిన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశిత గడువుకు ఇంకా 20 రోజులే ఉన్నందున చీరల ఉత్పత్తి రాత్రింబవళ్లు మిషన్ మోడ్ లో కొనసాగించాలన్నారు. అక్టోబర్ 10 నాటికి అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరల చేర్చాల్సిన బాధ్యత రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా తనపై ఉందన్నారు. సకాలంలో లక్ష్యం సాధించకపోతే ప్రభుత్వం సిరిసిల్ల పవర్‌లూంలపై ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకం వమ్ము చేసిన వారమవుతామన్నారు. వస్త్ర పరిశ్రమ బలోపేతానికి చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రస్తు త పరిస్థితిలో బతుకమ్మ వస్త్ర ఆర్డర్ లక్ష్యం చేరుకోకపోతే.. భవిష్యత్‌లో ఎన్నో అవకాశాలు కోల్పోయే ఆస్కా రం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని అసోసియేషన్‌లు సహకరించాలన్నారు. బతుకమ్మ వస్త్ర ఉత్ప త్తి మాత్రమే పవర్‌లూంలపై చేపట్టాలన్నారు. కాటన్, పాలిస్టర్, నైలాన్, పంచె, తువ్వాల, చేతి రుమాలు వంటి ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపి వేయాలని కలెక్టర్ కోరారు. ఇందుకు గాను ప్రతి 10 నుంచి 15 కా ర్ఖానాలకు జిల్లా, మండల స్థాయి అధికారులను 20 రోజుల పాటు ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ 12 లక్షల వస్త్ర ఉత్పత్తి జరగాలని కలెక్టర్ సూచించా రు. బతుకమ్మ వస్త్ర ఉత్పత్తి మాత్రమే చేపట్టడం వల్ల ఉపాధి కోల్పోనున్న వృద్దులు, సైజింగ్, వార్పిన్ కార్మికులకు 20 రోజుల వేతనం జిల్లా యంత్రాం గం చెల్లిస్తున్నదన్నారు. బతుకమ్మ వస్త్ర ఉత్పత్తి పూర్తి లక్ష్యంను సాధించేందుకు సహకరించే మ్యాక్స్, ఎస్‌ఎస్‌ఐ సంఘాల ప్రతినిధులు, వివిధ అసోసియేషన్‌లను ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.
వస్త్ర ఉత్పత్తి, అనుబంధ సంఘాల హామీ
సిరిసిల్లకు కేటాయించిన బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి లక్ష్యం సాధించేందుకు జిల్లా యంత్రాంగాని కి పూర్తి సహకారం అందిస్తామని వస్త్ర ఉత్పత్తి, అనుబంధ రంగాల అసోసియేషన్‌లు తెలిపాయ. ఈమేరకు కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. సిరిసిల్లలోని ఏ ఒక్క మరమగ్గం ఏ ఇతర ఉత్పత్తి చేపట్టకుండా తాము చూస్తామన్నారు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేసే మగ్గా ల యాజమాన్యాలు, ఆసాములపై అ సోసియేషన్ పక్షాన చర్య తీసుకుంటామన్నారు. చేనేత జౌళీ సహాయ సంచా లకుడు వీ.అశోక్‌రావు, డీఆర్‌డీవో రవీందర్, డీసీవో మహ్మద్ అలీ, అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు గడువు పొడిగించండి
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు గడువు పెంచాలని బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాస సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. గురువారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లు తొలగించటమే లక్ష్యం గా రాష్ట్రప్రభుత్వం 30 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు చేసిందని ఆరోపించారు. నగరంలో లక్ష ఓట్ల వరకు తొలగించి, మరణించిన వారి ఓట్లు అలాగే ఉంచటం శోచనీయమన్నారు. అన్నివర్గాల ఓత్తిడితో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టి, నామ్‌కే వాస్తేగా కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయిలోసామాగ్రి అందించకపోవటతో కొత్త ఓటర్ల నమోదులో సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ నేతలు బండ రమణారెడ్డి, గాజె రమేశ్, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాశ్, బోయినపల్లి ప్రవీన్‌రావు, కటకం లోకేష్, ముప్పిడి సునీల్, తదితరులు పాల్గొన్నారు.