కరీంనగర్

ప్రభుత్వ పథకాలపై అపోహ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, సెప్టెంబర్ 24: ప్రభుత్వ పరంగా అందే పథకాలపై ప్రజలకు ఎలాంటి అపోహవద్దని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం చొప్పదండి తహసీల్దార్ కార్యాలయంలో 23 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి అందజేశారు. ముఖ్యఅథితిగా హాజరైన రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు వరంగా మారిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇక నుంచి ఎంపీ వినోద్‌కుమార్‌కు తెలియపర్చితే ... అతని లెటర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోవచ్చని, కల్యాణలక్ష్మి పథకం ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోవాలంటే ఎమ్మెల్యే ద్వారా చేసుకోలేదని, కానీ నేడు ఆర్డీవోకు అధికారం ఇవ్వటం జరిగినందున దరఖాస్తు చేసుకొనే వారు ఆర్‌డీవో ద్వారా చేసుకోవాలని ఈ మేరకు గత ప్రభుత్వాలు ఎన్నికల్లో గుప్పించిన, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా అమలుపర్చిన దాఖలాలు లేవని కానీ.. కేసీఆర్ మేనిఫెస్టోలో లేని పథకాలనూ అమలు పర్చారని, అందుకే మహిళలు, ప్రజ లు కెసిఆర్ పక్షాన ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కెసిఆర్‌ను గెలిపించుకున్నట్లయితే మరెన్నో పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గుర్రం భూంరెడ్డి, జడ్పీటీసీ ఇప్పనపల్లి సాం బయ్య, తహసీల్దార్ రాజయ్య, ఎంపిటిసి ఎలిగేటి తిరుపతి, మాజీ సర్పంచ్ కర్రె శ్రీనివాస్, కొత్త గంగారెడ్డి, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, గుర్రం హన్మంత రెడ్డి, కుందేళ్ల బాలకిషన్, గాండ్ల లక్ష్మణ్, స్వామి రెడ్డి, స్వామి పాల్గొన్నారు.
కుల సంఘాల ఐక్యవేదిక ధర్నా
* ఎల్లంపల్లి ఉప కాలువ పనులు చేపట్టాలని డిమాండ్
* కలెక్టర్ శరత్ హామీతో శాంతించిన ఆందోళనకారులు
జగిత్యాల, సెప్టెంబర్ 24: ఎల్లంపల్లి ఉప కాలువ పనులు చేపట్టాలని డిమాం డ్ చేస్తూ మల్యాల మండల కులసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. నారయణపూర్ జలాశయం నుంచి వచ్చే కాలువ బల్వంతాపూర్ వరకు మూడేళ్ల క్రితం నిర్మాణం చేపట్టగా, ఆ గ్రామానికి వచ్చిన నీటితోనే చెరువులు నింపుతున్నారు కానీ.. ముత్యంపేట శివారులోకి వచ్చే కాలువ పనులు సర్వే చేయించకుండా ఆపడంతో తమ గ్రామాలకు తాగునీరు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల గ్రామానికి చుట్టూ కా లువ ఉన్నా నీరు అందడం లేదని, గతంలో వచ్చిన వరద కాలువ, ఎస్సారెస్పీ కెనాల్ నీరు రాకుండాపై గ్రామాల వారు అడ్డుకుంటే మాకు నీరు వచ్చేదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సరిపోకుంటే చెల్లించాలని అం దరం కలిసికట్టుగా పోరాడుతామని సర్వే పనులు అడ్డుకోకుండా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డాక్టర్ శరత్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. మల్యాల మండల కుల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు నేరెల్ల భూమారెడ్డి, డబ్బు గోవర్దన్ రెడ్డి, బోడకుంట ఆనందం, గడ్డం సజన్‌కుమార్, బోడ గోవర్దన్, సంగ ఆంజనేయులు, బెస్త రవి, సింగాపూర్ మల్లయ్య, మల్యాల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.