కరీంనగర్

అంతర్జాతీయ సాంస్కృతి మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 15: బతుకమ్మ పండుగ పర్వదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తం చేయాలనే సంకల్పంతో దేశంలోనే ప్రప్రథమంగా కరీంనగర్‌లో 7దేశాల నుంచి 40మంది కళాకారులు ఆయా దేశాలకుచెందిన సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం, బతుకమ్మ వేడుకలు అందరినీ అలరించాయి. సోమవారం బతుకమ్మ వేడుకల సందర్భంగా నగర్‌లో భాషా సంస్కృతిక శాఖ, బ్రహ్మకుమారీస్ సంయుక్త ఆధ్వర్యంలో వీకనె్వన్షన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం, బతుకమ్మ వేడులకు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు, బతుకమ్మ పండుగ ప్రతీరూమన్నారు. బ్రహ్మకుమారీస్ సహకారంతో 7దేశాలకు చెందిన 40మంది కళాకారులచే బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించటం గొప్ప విషయమన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో బతుకమ్మ పండుగకు ప్రాచుర్యం కల్పించి తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయుటకు ఇది చక్కని వేదికని కలెక్టర్ కొనియాడారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు బతుకమ్మలతో ఆటాపాటలతో ఆడి అలరించారన్నారు. ఈ సాంస్కృతిక మహోత్సవ వేడుకల్లో రష్యా, మలేషియా, ఇండోనేషియా, తైలాండ్, అర్జెంటినా, ఉక్రేన్, బనారస్ దేశాల నుంచి వచ్చిన కళాకారులు ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు.