కరీంనగర్

జెఎన్టీయుహెచ్ అభివృద్ధికి పూర్తి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటినరికాలనీ, ఏఫ్రిల్30: తెలంగాణ రాష్ఠ్రంలో ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందనీ రాష్ట్ర డిప్యూటీ సి ఎం, ఉన్నతావిద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం సెంటినరికాలనీలో మంథని జె ఎన్టీయుహెచ్ కళాశాలలో సమ్రయ-2016 వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి యాజమాన్యం 50 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. విద్యార్థులు సౌకర్యార్థం ఈ కళాశాలల వౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తాననీ అన్నారు. రూ.90 కోట్లతో ఈ కళాశాలలో వివిధ అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్యాకల్టీ సరిగ్గా ఉండాలనీ సూచించారు. వచ్చే విద్య సంవత్సరం జూలై ప్రారంభమయ్యే వరకు ఫర్నీచర్ కోనుగోలు చేయాలనీ యూనివర్సిటి అధికారులను డిప్యూటీ సిఎం ఆదేశించారు.అకాడమిక్ బ్లాక్, లైబ్రరీ హాస్టల్స్‌లలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉండాలన్నారు. మూడు ఆర్వో వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేయాలనీ సూచించారు. మధ్యంతరంలో ఆగిన కౌంపౌండ్ వాల్ నిర్మాణంను పూర్తి చేయాలనీ ఆదేశించారు. సమస్యలు తీవ్రంగా ఉండడంపై డిప్యూటీ సి ఎం పెదవి విరిచారు. వరంగల్‌లోని నిట్ ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించాలనీ సూచించారు. ఇంత పెద్ద మొత్తంలోని ఉన్న భూమికి లే ఆవుట్ చేయాలనీ, ఓక పద్ధతి ప్రకారం భవనాలు నిర్మించాలనీ అన్నారు. ముఖ్యంగా భారీగా మొక్కలు నాటాలనీ పిలుపునిచ్చారు. కళాశాలలో హెచ్ ఓడి, ప్రోపెసర్లు, ఔట్ సోర్సింగ్, సిబ్బంది లేరనీ కళాశాలకు భారీగా నిధులు కేటాయించాలనీ మంథని ఎమ్మెల్యే పుట్టమధు డిప్యూటీ సిఎంను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తక్షణమే వీటికి సంబంధించిన రిపోర్టు తయారు చేసి తనకు అందించాలనీ ఆదేశించారు. కళాశాలలో స్టూడెంట్ అక్టివేట్ సెంటర్ ఉందా అని డిప్యూటీ సి ఎం అధికారులను అడగగా లేదనీ బదులిచ్చారు. తక్షణమే ఈ సెంటర్ ఏర్పాటు చేయాలనీ దీనికి గోదావరిఖని ఎ ఎస్పీ విష్ణువారియర్‌ను ఇన్‌చార్జీగా నియమించాలన్నారు. ఎమ్మెల్యే పుట్టమధు కళాశాల అభివృద్ధికి పని చేస్తాడనీ, ఎ ఎస్పీ వారియర్ విద్యార్థులకు మార్గదర్శక పూత్రాలు తెలియచేస్తాడన్నారు. అనంతరం కళాశాలలోని వివిధ అభివృద్ది పనులను డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఫేజ్-2 కింద రూ.34.08 కోట్లతో బాయ్స్,గర్ల్స్ హస్టల్‌ల నిర్మాణం పూర్తి కాగా వీటిని ప్రారంభించారు. ఫేజ్-3 కింద రూ.33 కోట్ల నిధులతో అకాడమిక్ బ్లాక్-2, లైబ్రరీ, గెస్ట్‌హౌజ్ నిర్మాణం పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేసారు. మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామనీ హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎఎంపి బాల్క సుమన్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఆర్జీ-3 జి ఎం డా. ఎం ఎస్.వెంకట్రామయ్య, రిజిష్ట్రార్ యాదయ్య, ప్రిన్సిపాల్ మార్కండేయ, ఎంపిపి ఇనుగంటి ప్రేమలత, జడ్పీటిసి సంపత్, ఎంపిటిసిలు పల్లె ప్రతిమపివిరావు, మొల్మూరి శ్రీనివాస్, గంట వెంకట రమణరెడ్డి, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దాసరి రాయలింగు, పూదరి సత్యనారాయణ, బురుగు రాజు, ఆసం తిరుపతి పాల్గొన్నారు.