కరీంనగర్

ఇస్రో జాతీయ సదస్సుకు జిల్లా సైన్స్ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూ రల్, నవంబర్ 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, జపాన్ ఏరోసిస్సేస్ ఎక్స్ ఫ్టోరేషన్ ఏజేన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఐ.ఐ. ఆర్.ఏస్ డేహ్రాడూన్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సులో జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు పాల్గొనున్నారు. నవంబర్ 15, 16 తేదీల్లో డేహ్రాడూన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఏజేన్సీలో ‘అంతరిక్ష విద్య’పై ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న సదస్సులో జపాన్, నేపాల్ దేశాలతో పాటు భారత దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 70 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో మన సౌర కుటుంబం, అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు, సామాజిక అవసరం, రాకేట్రీ వాటర్, ఖగోళ విద్య, స్టేమ్, అంతరిక్ష విద్య తదితర సామాకాలిన అంశాలపై ఉపాధాయులకు అవగాహన చేస్తారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు పాల్గొంటుండగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి రవినందన్ రావు ఒక్కరు పాల్గొనడం విశేషం. జాతీయ సదస్సుకు హాజరవుతున్న జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావును జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, సెక్టోరియల్ అధికారులు పద్మ, మధు, సహోద్యోగులు తదితరులు అభినందించారు.

పురోగతి దశలో థర్మల్ ప్రాజెక్ట్
- ఎన్టీపీసీ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకాష్ తివారీ
గోదావరిఖని, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రం విద్యుత్ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీలో నిర్మాణం జరుపుకుంటున్న తెలంగాణ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులు పురోగతి దశలో కొనసాగుతున్నాయని ఎన్టీపీసీ ఆపరేషన్ డైరెక్టర్ ప్రకాష్ తివారీ అన్నారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ థర్మల్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ దూబేతో కలిసి ఆపరేషన్ డైరెక్టర్ ప్రకాష్ తివారీ సందర్శించారు. గంటల పాటు రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆయన పర్యటించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను స్వయంగా పరిశీలించారు. అక్కడ నిర్మాణం పనులకు సంబంధించి సాంకేతిక వివరాలను, పనుల పురోగతిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆపరేషన్ డైరెక్టర్ తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం పనులపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్ పనులు అనుకున్న దానికన్న మరింత వేగంగా పనులు జరగడంపైన స్థానికంగా ఉన్న ఉద్యోగులు, అధికారుల పని తీరుపై ప్రకాష్ తివారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట రామగుండం ఎన్టీపీసీ ఇడి రవీంద్రతోపాటు తెలంగాణ థర్మల్ ప్రాజెక్ట్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.