కరీంనగర్

నామినేషన్ల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 14: కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు బుధవారం ఐదుగురు నామినేషన్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మర్పించారు. తెరాస నుంచి తాజా, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్, బిజెపి నుంచి బండి సంజయ్, స్వతంత్ర అభ్యర్థులుగా బండి శ్రీనివాస్, ముస్కు మహేందర్ రెడ్డిలు నామినేషన్లు సమర్పించారు.
రమేశ్‌బాబు నామినేషన్
వేములవాడ: వేములవాడ నియోజకవర్గ టీ ఆర్ ఎస్ అభ్యర్థిగా బుధవారం డా.రమేశ్‌బాబు నామినేషన్ దాఖలు చేశారు.ముందుగా తన నివాసం నుంచి రాజన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో కోడెకు ప్రత్యేక పూజలు చేశారు.అంతరాలయంలోని స్వామివార్లను,అమ్మవారిని దర్శించుకున్నారు.శ్రీ సీతారామంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 11.30గంటలకు వేములవాడ అర్భన్ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారి ఖీమ్యానాయక్ తొలిసెట్ నామినేషన్ సమర్పించారు. మెట్టప్రాంతమైన వేములవాడ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని రమేశ్‌బాబు చెప్పారు. నామినేషన్ దాఖలు చేశాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎత్తిపొతల పథకం ద్వారా ఇప్పటికే 40వేల ఎకరాలకు గోదావరి జలాలను అందించడం జరిగిందని, మరో 60 ఎకరాలకు త్వరలోనే అందిస్తామని చెప్పారు. అచ్యయ్యకుంట చెరువుగోదావరి జాలలతో నిండుకుండా ఉందని చెప్పారు. నాగారం చెరువునిండాక కథలాపూర్ మండలంలోని సూరమ్మచెరువునింపుతామని చెప్పారు.
అట్టహాసంగా ఈశ్వర్ నామినేషన్
ధర్మపురి: తెరాస మేనిఫెస్టో కమిటీ బాధ్యులు, తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి సిట్టింగ్ శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ బుధవారం నామినేషన్ పత్రాలను ధర్మపురి శాసనసభ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, భిక్షపతికి రెండుసెట్లను అందజేశారు. వెల్గటూరు ఎంపీపీ శ్రీనివాసరావు, గోలి సురేందర్‌రెడ్డి ప్రతిపాదకులుగా, ప్రముఖ న్యాయవాది కొండపలకల వెంకటేశ్వర్‌రావు, గోలి గంగారెడ్డిలు వెంట రాగా దాఖలు చేశారు.

చొప్పదండి నుంచి బరిలో బొడిగే శోభ
*బీజేపీ తుది జాబితా విడుదల *పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
*వేములవాడ మినహా మిగతా చోట్ల కొత్తముఖాలే *గెలుపుపై కమలం నేతల్లో పెరుగుతున్న ధీమా
కరీంనగర్ టౌన్, నవంబర్ 14: భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లో నెలకొన్న టెన్షన్ ఎట్టకేలకు వీడింది. కొద్దిరోజులుగా పెండింగ్‌లో ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ, బుధవారం సాయంత్రం జాబితా విడుదల చేసింది. దీంతో తమ తమ సెగ్మెంట్లలో పోటీపై నెలకొన్న సందిగ్దత వీడగా, ఇకనుంచి ఎన్నికల కార్యక్షేత్రంలో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ స్థానాలైన చొప్పదండి టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ బీజేపి తీర్ధం పుచ్చుకుని, టికెట్ తెచ్చుకోగా, హుజురాబాద్ నుంచి పల్లె రఘు, మంథని నుంచి సంపత్‌యాదవ్, హుస్నాబాద్ నుంచి చాడ శ్రీనివాస్‌రెడ్డి, వేములవాడ నుంచి ప్రతాప రామకృష్ణల పేర్లు ప్రకటిస్తూ ఆపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జాబితా విడుదల చేసింది. మూడో జాబితాలో ప్రకటించిన వారిలో వేములవాడ మినహా మిగతా సెగ్మెంట్ల నుంచి బరిలో నిలవనున్న వారంతా కొత్త ముఖాలే కావటం గమనార్హం. మొదటి రెండు విడతల్లో ఎనిమిది స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. వీటిలోసిరిసిల్ల,కోరుట్ల నుంచి టికెట్లు పొందిన నర్సాగౌడ్, జె ఎన్ వెంకట్‌లు కూడా పార్టీకి కొత్తవారే కావటం గమనార్హం. గెలుపే లక్ష్యంగా సమర్ధులైన అభ్యర్థుల వేటలో మూడోజాబితా ప్రకటనలో జాప్యం జరిగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నిర్ణయాత్మకశక్తిగా మారబోతున్న నేపథ్యంలో గెలుపు గుర్రాల వేటలో విజయం సాధించినట్లు, ఇక ఓట్ల వేటలో కూడా భాజపా ముందువరుసలో ఉండేలా వ్యూహాలు రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, గతంలో ప్రకటించిన సెగ్మెంట్లలో జగిత్యాల మినహా మిగతాచోట్ల నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులంతా ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆయాచోట్ల నుంచి పోటీ చేసిన వారే. కాగా, జిల్లాలో గెలుస్తామనే ధీమాతో ఉన్న స్థానాల్లో కరీంనగర్, పెద్దపల్లి, వేములవాడ, కోరుట్ల, రామగుండం, చొప్పదండి ఉన్నాయి. వీటిపై కేంద్ర పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం ఆయా నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమించి, పక్కా ప్రణాళికతో ప్రచారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనే సూత్రానికనుగుణంగా గతంలో గెలుపొందిన చోట్లలో మరోసారి తమ సత్తాచాటి, పూర్వవైభవం తెచ్చుకునే క్రమంలో జిల్లాలో కమల వికాసానికి ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారని, తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

మావోయిస్టు నేతల తలలకు వెలలు
ముత్తారం, నవంబర్ 14: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతల తలలకు వెలలను నిర్ధారిస్తూ పోలీసులు పోస్టర్లను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా ముందస్తుగానే ఆయా ప్రాంతాల్లో నేతలుగా పని చేసిన మావోయిస్టుల తలలకు నగదు బహుమతుల నజరానాను ప్రకటించింది. ప్రజా పోరాటాల ముసుగులో ఉన్న యాక్షన్ టీం నక్సలైట్ల సమాచారం తెలిపిన వారికి 5లక్షల రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుందని ముద్రించిన పోస్టర్లను పోలీసులు బుధవారం రోజున ముత్తారం మండలంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లను వేశారు.