కరీంనగర్

కూటమి మాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, నవంబర్ 16: కుట్రలతో అధికారం చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్, టీడీపీలు జత కట్టాయని, కూటమి మాటలు నమ్మవద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. తెలంగాణలో ఆంధ్ర నాయకులు పెత్తనం కొనసాగించడంతో పాటు తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికే ఆంధ్ర సీఏం చంద్రబాబు నాయుడు అజాత శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టాడని, కూటమికి ఓటు వేస్తే పాత కాలపు కష్టాలు మళ్లీ పునరావృతం అవుతాయన్నారు. బంగారు తెలంగాణ కోసం రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో తెరాస పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని రంగంపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో శుక్రవారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి నియోజక వర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలో సాగు నీటి కష్టాలు తీరి పోతాయని, ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు కలిగిన కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలలకు కూడా పూర్తి స్థాయిలో సాగు నీరు అందిస్తామన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందాయని, మిషన్ భగీరథతో మంచి నీటి కష్టాలు తీరనున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఇతరులు ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. మహారాష్టక్రు చెందిన 40 గ్రామాల ప్రజలు తాము తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని తీర్మాణించడం ఇందుకు నిదర్శనంగా చెప్పచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడనే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన తెరాస ప్రభుత్వానికి మరోసారి ఆవకాశం కల్పించాలని ఆయన కోరారు. కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు పథకం, ఆసర పథకం వంటివి ఎంతగానో ఆదుకున్నాయని ఆయన తెలిపారు. ప్రపంచం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుందని, అమెరికా వంటి ఆగ్ర రాజ్యం ఇతరులు ఉపాధి కోసం తమ దేశం రావద్దని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, అలాగే 80 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆయన పేర్కోన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి గెలుపించాలని కోరారు.