కరీంనగర్

పూజారి హత్యపై ప్రభుత్వ తీరు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, నవంబర్ 17: రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఆలయ పూజారిపై జరిగిన దాడి, హత్యోదంతంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు గర్హనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అన్నారు. దురహంకారంతో జరిగిన ఈ దాడిపై కనీస వ్యాఖ్యలు చేయకపోవటం శోచనీయమని, తన పార్టీకి లాభం చేకూర్చే క్రమంలోనే మెజార్టీ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ, మరోవర్గాన్ని నెత్తినెత్తుకోవటం మెజార్టీ వర్గాన్ని వంచించటమేనన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలోబీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు మద్ధతుగా ప్రచారం చేపట్టేందుకు శనివారం ఆయన నగరానికి వచ్చారు. ఈసందర్భంగా స్థానిక మహాశక్తి దేవాలయంలోపూజలు నిర్వహించిన అనంతరం ఆయన, 49,50 డివిజన్ల పరిధిలోని విద్యానగర్, సాలేహ్‌నగర్, హరిహర నగర్, వావిలాలపల్లి, తదితర కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కాలనీల వాసులు ఆయనను ఘనంగా స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అణిచివేత నిర్భంధం, నియంతృత్వ ధోరణిలో ఏకపక్షంగా కొనసాగుతుందని, దానిని అలుసుగా తీసుకున్న మరో వర్గం వరంగల్ లాంటి దాడులకు తెగబడుతూ, ఆకృత్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇది భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు స్థానం లేకుండా పోయిందని, ఇందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీ ఆర్ అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పథకాలు నిరుపేదలకు అందాలంటే, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ప్రజల నుంచి రావాలన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను గెలిపించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణ బద్దులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో మోదీ వెంట అభ్యర్థి బండి సంజయ్‌కుమార్, నాయకులు బాస సత్యనారాయణరావు, కొట్టె మురళీకృష్ణ, బేతి మహేందర్‌రెడ్డి, బండ రమణారెడ్డి, కొరిటాల శివరామకృష్ణ, బోయినపల్లి ప్రవీన్‌రావు, కటకం లోకేశ్, ఉప్పరపల్లి శ్రీనివాస్, నవీన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, ఎల్లారెడ్డి,ప్రసాద్, కచ్చు రవి, దుబాల శ్రీనివాస్‌తో పాటు 400మంది కార్యకర్తలు పాల్గొన్నారు.