కరీంనగర్

నాలుగున్నర ఏళ్లుగా గ్రహణంలో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, నవంబర్ 17: నాలుగెళ్లన్నర యెళ్లుగా తెలంగాణ రాష్టన్న్రికి కేసిఆర్ కుటుంబంతో గ్రహాణం పట్టిందని కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకర్త విజయశాంతి అరోపించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో చెపట్టిన రోడ్డు షో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ ప్రచారకర్త విజయశాంతి, భట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గోన్నారు. మానకొండూర్ కేంద్రంలోని చెరువుకట్టవద్ద గల డాక్టర్ బిఅర్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టార్ ప్రచారకర్త విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన కేసిఆర్ దోర, వారి కుటుంబ సభ్యులను గద్దెదించేంతవరకు ప్రజలు ఉద్యామించాలని ద్వజమేత్తారు. తెలంగాణ రాష్టన్న్రి ఇచ్చింది దేవత సోనియగాంధీ అని అలాంటి గోప్పనేతను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలదేన్నారు. ఐదుయెళ్ల పాలనలో టీఆర్‌ఎస్ పాలనలో ఏలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. కరీంనగర్ ఉద్యామల గడ్డన్నారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలను కేసీఆర్ నిర్వహించారని తెలిపారు. టీఆర్‌ఎస్ పాలనలో ఐదువేల ప్రభుత్వ పాఠశాలు ముసివేసి యేడాదికి 10వేల మంది చదువులకు దూరం చేసిన్నారని అరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామిలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన్నారని రాభోయే రోజుల్లో టీఆర్‌ఎస్ పార్టీని, కేసిఆర్ మాటాలను ప్రజలు నమ్మరని తెలిపారు. ఎన్నికల్లోటీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులకు అడుగుఅడుగున ప్రజలు నీలదియడం సిగ్గచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోవస్తే రాష్ట్ర బడ్జెట్‌ను నాలుగు కోట్ల ప్రజలకు పంపిణి చేస్తామని, యేడాదికి 6 సిలెండర్లు, రూ.10 లక్షలు వరకు మహిళలకు వడ్డిలేని రుణాలు, రైతులకు మద్దతుధర, రుణామాఫీ వంటి ఎన్నో ప్రథకాలను ప్రవేశపెట్టనుందన్నారు. రాభోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్‌కు ఓటువేసి ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎంపిపిలు మాతంగి లింగయ్య, ఒగ్గు దామోందర్, మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపిటిసిలు సత్యం, శ్యాం, సీనియర్ నాయకులు పోలాడి రామరావు, మాజీ సర్పంచ్‌లు ఆరెల్లి సంపత్, రవింధ్రచారి పాల్గొన్నారు.

ఖమ్మంపల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్
ముత్తారం, నవంబర్ 17: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ముత్తారం ఎస్ ఐ షేక్ జాని పాషా ఆధ్వర్యంలో పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించారు. శ్రీరాంపూర్ గ్రామం నుంచి ఖమ్మంపల్లి మానేరు పరివాహక ప్రాంత ఖమ్మంపల్లి గ్రామం వరకు ఉన్న అడవుల్లో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు కదిలికల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టిన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. అనంతరం సందరెల్లిలో ప్రజలతో ఆయన మాట్లాడారు. అనుమానితులు గ్రామంలో సంచరించిన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారికి అవగాహన కల్పించారు.

పరిశుభ్రత లేకుంటే జరిమాన
- కమిషనర్ సత్యనారాయణ హెచ్చరిక
కరీంనగర్ టౌన్, నవంబర్ 17: నగరంలో పలు వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు తమ దుకాణాల సమీపంలో పరిశుభ్రత పాటించకపోతే జరిమాన తప్పదని నగర పాలక సంస్థ కమీషనర్ కె.సత్యనారాయణ హెచ్చరించారు. నగర పరిశుభ్రతను పరిశీలించేందుకు శనివారం ఆయన పలు డివిజన్లలో పర్యటించారు. ఈసందర్భంగా నగరంలోని కమాన్ ప్రాంతంలో గల ప్రధాన రహదారిపై గల బేకరి దుకాణం ఎదుట గల అపరిశుభ్ర వాతావరణాన్ని ఆయన గమనించారు. బేకరి విసర్జిత పదార్ధాలు ఇష్టారాజ్యంగా రహదారిపై వేయటంతోబీటీ రోడ్డు చెడిపోవటం గ్రహించి,తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రూ.5వేల జరిమాన విధించారు. అంతకుముందు శివాలయం వీధి, పాతబజార్, కాపువాడలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. రోడ్డు నాణ్యత పరిశీలించి, వర్కు, రికార్డు పుస్తకాలు తనిఖీ చేశారు. మరోవైపు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా నగరంలో కొనసాగుతున్న సానిటేషన్ పనులు పరిశీలించారు. అలాగే, చెత్త తరలిస్తున్న ట్రాక్టర్లు గమనించి, చెత్తను తరలించిన ట్రిప్పుల వివరాలు అడిగి తెల్సుకున్నారు.