కరీంనగర్

కూటమితో తెలంగాణ ఎడారే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, నవంబర్ 19: జరగనున్న అసెంబ్లి ఎన్నికలు ఎంతో విలువైనవని, అడుగడుగున తెలంగాణ అభివృద్దితో ముందుకు సాగుతున్న ఫలితాలు అలాగే కొనసాగి, బంగారు తెలంగాణ కళ సాకారం కావాలంటే తప్పకుండా కెసిఆర్‌ను ఆశీర్వదించాలని, అలాగే మహాకూటమి, బిజెపిలను నమ్మితే తెలంగాణ ఎడారి అవుతుందని కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో సుంకె రవిశంకర్‌కు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో ఎంపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతు ఎన్నో ఏళ్లు తెలంగాణను ఆంధ్ర నేతలకు తాకట్టు పెట్టామని, కానీ తెలంగాణ వచ్చాక కెసిఆర్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాలుగున్నర ఏళ్లలోనే ఆడబిడ్డలు, రైతులు, అన్ని కుల వృత్తుల వారు, వ్యాపారులు, విద్యార్థులు, వృధ్దులు, వికలాంగులు ఎన్నో సంక్షేమ పథకాలు అందుకున్నారని, ఈ రోజు కెసిఆర్‌ను తమ బందువుగా ఆశీర్వదిస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేని ప్రతి పక్షాలు జతకట్టాయని అన్నారు. తెలంగాణను మరో మారు ఎడారిగా మార్చేందుకే కూటమితో ముందుకు వచ్చాయి తప్ప, తెలంగాణ అభివృద్దిని ఆకాక్షించి మాత్రం కాదని విమర్శించారు. ఇక్కడ స్థానికుడైన నిరుపేద కుటుంబానికి చెందిన రవిశంకర్‌కు టికెటి కెసిఆర్ ఇచ్చారని, ఇక్కడే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్థాడని, తప్పకుండా రవిశంకర్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపిపి గుర్రం భూమారెడ్డి, జడ్‌పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్ రావు, ఎంపిపి దూలం బాలాగౌడ్, నర్సింగారావు, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు వెల్మ మల్లారెడ్డి, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, కొత్త గంగారెడ్డి, బత్తిని సంపత్, నలుమాచు రామక్రిష్ణ, ఎన్నం మునీందర్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, రాపెల్లి ఐలయ్య యాదవ్, ముద్దం మల్లేశం, మచ్చ రమేష్, లోక రాజేశ్వర్ రెడ్డి, కర్రె శ్రీనివాస్, గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, తోట శేషాద్రి, సదాశివ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.