కరీంనగర్

దేశానికే కూటమి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 19: రాచరిక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో ఏర్పడ్డ మహాకూటమి భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందని టీటీడీపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. సోమవారం జగిత్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం కొత్తబస్టాండ్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెరాస నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. తన 40ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంతపెద్ద ర్యాలీ చూడలేదని అన్నారు. కేసీఆర్,కేటీఆర్, కవితలు టీడీపీకి క్యాడర్‌లేదని కాంగ్రెస్‌కు కార్యకర్తలు లేరని అన్నప్పటికి తాను ఎప్పుడు బాధపడలేదని పేర్కొన్నారు. సామాన్యకుటుంబంలో పుట్టిన తాను టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగానని కల్వకుంట్ల ఫ్యామిలికి సేవకులంకాదని విమర్శించారు.యాభైవేల కోట్లను కల్వకుంట్ల ఫామ్‌హౌజ్‌లో దాచారని రమణ విమర్శించారు. మంత్రి ఈటల రాజేంధర్ వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని అన్నారని కానీ, పేదలకు చెందాల్సిన వేలకోట్ల రూపాయలను ఫామ్‌హౌజ్‌లో పెట్టారని యాభైవేలకోట్లరూపాయలు కొట్టేసిన కల్వకుంట్ల ఫ్యామిలికి సరైన సమయంలో సాక్ష్యాధారాలతో సహ బయటపెట్టి సొమ్మును కక్కిస్తానని అన్నారు. రాజకీయాల్లో ఉండేవారు సేవకోసం రావాలని కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం సేవకులు కారని, జీవన్‌రెడ్డిని అసెంబ్లీకి పంపించి కూటమి జైత్రయాత్ర జగిత్యాల నుంచేప్రారంభిస్తామన్నారు. పేదలకోసం రూపొందించిన పథకాలను కామన్‌మినిమమ్ ప్రొగ్రాంలో చేర్చి పేదలకు న్యాయం చేస్తామన్నారు.కల్వకుంట్ల కుటుంబం కబంధహస్తల నుంచి 4కోట్ల ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి,సారంగాపూర్,రాయికల్ జగిత్యాల జడ్పీటీసీలు భూక్యసరళ,మాధవి, పెండం నాగలక్ష్మితో పాటు వేలాది మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.