కరీంనగర్

ఓటర్లను ప్రలోభపెట్టే పార్టీలపై నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 19: శాసనసభ ఎన్నికలలో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చులపై, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించే వారిపై నజర్ పెట్టామని జనరల్ అబ్జర్వర్ రాంప్రతాప్ సింగ్ జోడన్ తెలిపారు. సోమవారం జిల్లాలోని మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ఎన్నికల కార్యాలయాలను సందర్శించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శాసనసభ ఎన్నికలపై సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బంధీగా అమలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ 7వ తేదీన జరుగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు పంపించగా రాంప్రతాప్ సింగ్ జోడన్ ఆదివారం సాయంత్రం జిల్లాకు చేరుకొని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ రాంప్రతాప్ సింగ్ జోడన్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పోటీలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చులపై నిఘా ఉంటుందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా పోటీలో ఉన్న అభ్యర్థులు పంపిణీ చేసే డబ్బు, మద్యం బహుమతులను పంచేవారిపై దృష్టి సారించాలన్నారు. మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సరిహద్దుల్లోని ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద నియమించిన సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారా? లేదా? అనే విషయంపై ఆరా తీశారు. ఇంత నిఘా కొనసాగుతున్నా భారీ మొత్తంలో నగదు తరలిపోవడం, పెద్దమొత్తంలో పట్టుబడుతుండడం చూస్తుంటే ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే బరిలో నిలిచిన అభ్యర్థులు యత్నిస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించే పార్టీలపై నిఘా పెంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నారు. ఎక్స్‌పెండీచర్ బృందాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చుల వివరాలను ప్రతీ రోజు నమోదు చేయాలని, ఎలక్షన్ కమీషన్, నియమ నిబంధనలకు అనుగుణంగా నిఘాను తీవ్రతరం చేశామన్నారు. ఎన్నికల నివేదికలను ఎన్నికల సంఘానికి నివేధిస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. తాను కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేశానని, శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు జిల్లాలోనే ఉంటానని వెళ్లడించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన జరిగినట్లు తెలిస్తే ఎవరైనా సరే తనకు 827751149 నెంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. మానకొండూర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల సిబ్బంది సమర్థవంతంగానే విధులు నిర్వహిస్తున్నారని, ఇదే విధానాన్ని ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కొనసాగించాలని సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సూచించినట్లు జనరల్ అబ్జర్వర్ రాంప్రతాప్ సింగ్ జోడన్ తెలిపారు.
కేటీఆర్ నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు
సిరిసిల్ల, నవంబర్ 19: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు అయిన సోమవారం 13 మంది 19 సెట్లను దాఖలు చేశారు. శనివారం వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో అయిదుగురు అభ్యర్థులు తిరిగి సోమవారం ప్రధాన పార్టీలు ర్యాలీగా తరలివచ్చి డమీ నామినేషన్ల పత్రాలను సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ల పర్వం ముగిసే సమయడంతో మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వీరు మొత్తం 26 సెట్లను అందచేశారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కెకె.మహేందర్‌రెడ్డి నాలుగు, తెరాస అభ్యర్థి కల్వకుంట్ల తారకరామారావు నాలుగు, బీఎస్పీ అభ్యర్థి ఆవునూరి రమాకాంత్ మూడు సెట్లు, బీజేపీ అభ్యర్థి రెండు సెట్లను సమర్పించారు. కాగా నామినేషన్లను రిట్నింగ్ అధికారి టి.శ్రీనివాసరావుకు అందచేసిన 14 మంది అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కెకె.మహేందర్‌రెడ్డి(కాంగ్రెస్), మల్లుగారి నర్సాగౌడ్(బీజేపీ), ఆవునూరి రమాకాంత్(బీఎస్పీ), కల్వకుంట్ల తారకరామారావు(టీఆర్‌ఎస్), కూరపాటి రమేశ్(బీఎల్‌పీ), చౌటపెల్లి వేణుగోపాల్(ఎంసీపీఐ(యు), గౌట రమేశ్(శివసేన), బోయినపెల్లి శ్రీనివాస్(అ.్భ.దేశ్‌మోర్చా), కారంగుల యాదగిరి(జై స్వరాజ్ పార్టీ), తక్కల కిరణ్(ఆర్‌పీఐ-ఎ), అల్వాల కనకరాజు(ఇండి), దోసెల చంద్రం(ఐపీబీపీ), కోడూరి బాలలింగం(ఇండి), అర్వరాజు కృష్ణమరాజు(న్యూ ఇండియా పార్టీ) ఉన్నారు.