కరీంనగర్

జిల్లాలో 10నామినేషన్లు తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 20: నియోజకవర్గ పరిధిలో 10 నామినేషన్లు తిరస్కరించబడినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలో 2018 డిసెంబర్ 7న జరుగు శాసన సభ ఎన్నికల సందర్భంగా 26-కరీంనగర్, 27-చొప్పదండి, 30-మానకొండూర్, 31-హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు నవంబర్ 12 నుంచి 19 వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను మంగళవారం స్కృటినీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. నామినేషన్ల స్కృటినీలో భాగంగా 26-కరీంనగర్ నియోజకవర్గంలో అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్లు, ఎలాంటి నామినేషన్లు తిరస్కరించబడలేదని తెలిపారు. 27-చొప్పదండి నియోజకవర్గంలో బిజెపి పార్టీ తరపున నామినేషన్ సమర్పించిన జె.స్వామి ఫారం-ఎ, ఫారం-బి సమర్పించనందున అట్టి ఒక నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. 30-మానకొండూర్ నియోజకవర్గంలో అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు అన్ని సరిగా ఉన్నాయని ఎవరి నామినేషన్ పత్రాలను తిరస్కరించబడలేదని ఆయన తెలిపారు. 31-హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను స్కృటిని చేయగా 9 నామినేషన్ పత్రాలు తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. బిజెపి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసిన ఉప్పు రవీందర్ ఫారం-ఎ అండ్ బి సమర్పించనందున, అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించినట్లు తెలిపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ సమర్పించిన కష్యప్ రెడ్డి పారం - ఎ అండ్ బి సమర్పించనందున, ఒక్కరే ప్రపోజ్ చేసినందున తిరస్కరించినట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సింగారపు రమేష్ బాబు 10 మందికి బదులు ఏడుగురే ప్రపోజ్ చేసినందున నామినేషన్ తిరస్కరించినట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన జి.ఉమ అఫిడవిట్‌లో అన్ని కాలములు పూరించనందున తిరస్కరించినట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంగారపు తిరుపతి అఫిడవిట్‌లో అన్ని కాలములు పూరించనందున తిరస్కరించినట్లు తెలిపారు. జై స్వరాజ్ పార్టీ తరపున నామినేషన్‌లు వేసిన ప్రశాంత్ పల్లె అఫిడవిట్‌లో అన్ని కాలములు పూరించనందున తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ మేకల మల్లేష్ యాదవ్ అఫిడవిట్‌లో అన్ని కాలములు పూరించనందున తిరస్కరించినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ తరపున నామినేషన్ సమర్పించిన దొంత భద్రయ్య ఫారం - ఎ అండ్ బి సమర్పించనందున నామినేషన్ తిరస్కరించినట్లు తెలిపారు. జై మహాభారత్ పార్టీ తరపున నామినేషన్ సమర్పించిన చల్లూరి భాస్కర్‌కు నామినేషన్ పత్రములలో ఒక్కరే ప్రపోజ్ చేసినందున నామినేషన్ పత్రాన్ని తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదు చేస్తా
- జగిత్యాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి
జగిత్యాల, నవంబర్ 20: జగిత్యాల అసెంబ్లీ రిటర్నింగ్ అధికారిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని జగిత్యాల అసెంబ్లీ కాంగ్రెస్‌అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్నాడని జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్‌లోని ఫారం-26కు అనుగుణంగా విద్యార్హతలు, క్రిమినల్ కేసులు వంటివాటిని నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తిగా నింపాలని అలా చేయని పక్షంలో రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి నోటీసులు ఇవ్వొచ్చని స్క్రూటీని అయిపోతే బ్లాక్‌లో పెట్టవచ్చని అన్నారు. కాలమ్-5(1)లో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయోలేదో టిక్ చేయాలని అలా చేయకుండా అసంపూర్తిగా వదిలేశారని అన్నారు. ప్రతి కాలమ్‌ను పూర్తిచేయాలనే నిబంధన ఉన్నప్పటికి అలా చేయలేదని నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారి పక్షపాతంగా అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.సబ్‌క్లాజ్ 2 ప్రకారం కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికి ఆ కాలంలో టిక్ చేయాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని విషయాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ విషయమై కోర్టుకు వెళ్లే ఆలోచన ఉందా అని విలేకరులు అడుగగా ఆ ఆలోచన లేదని తెలిపారు.