కరీంనగర్

పంచాయతీ పోరు జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 10: హైకోర్టు నిర్ధేశించిన గడువులోపు గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు బీసీల రగడ, అటు రిజర్వేషన్లు పెంచేది లేదంటూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు సూచించిన జనవరి 15లోపు పంచాయితీ పోరు ముగించటంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే సాధారణ ఎన్నికల సమరం ముగియనే లేదు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించటమంటే అధికారులు కొంత మేరకు వెనుకంజ వేస్తున్నట్లుతెలుస్తోంది. నేటితో లెక్కింపు పూరె్తైనా కొత్త ప్రభుత్వం కొలువుదీరి, పాలన పగ్గాలు చేపట్టేవరకు కనీసం పదిహేను, ఇరవై రోజులైనా పడుతుందని, నిర్ధేశించిన షెడ్యూల్ మేరకు కూడా చేపట్టడం కష్టసాధ్యమేనని అధికార యంత్రాంగం పేర్కొంటుంది. వాస్తవానికి ఇప్పటికే బీసీ గణన పూర్తి చేసిన అధికారులు సంబంధిత జాబితాలతో సిద్ధంగానే ఉన్నా, మరో మూడు వారాలు కోర్టు తీర్పు వాయిదా వేయటంతో బీసీ జాబితా ముసాయిదా విడుదలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు గ్రామ పంచాయితీల్లో బీసీ జాబితాలు ప్రదర్శించి, రేపుఫిర్యాదులు స్వీకరించాల్సి ఉంది. ఈనెల 25న తుది జాబితా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, అత్యధిక చోట్ల ఈ జాబితాలు ప్రదర్శించలేదని తెలుస్తోంది. మరోవైపు రాజ్యాంగాన్ని సవరించే వరకు అసలు ఎన్నికలు నిర్వహించకూడదంటూ బిసి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీటికితోడు కొత్త గ్రామపంచాయితీల్లో కొన్ని రద్దు చేయగా, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు, నగర పాలక సంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విలీనం చేసింది. దీంతో ఆయా గ్రామాలకు చెందిన వారితో పాటు, కొత్తగా ఏర్పాటు చేసిన జిపిల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, వాటికి హద్దులు కూడా సక్రమంగా నిర్ణయించలేదంటూ మరికొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులపై కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, ఎన్నికలు నిర్వహించటం అసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలోపంచాయితీ సమరం ఇప్పట్లో ఆరంభించటం గగన కుసుమమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.