కరీంనగర్

హక్కుల సాధనకై ఎంతకైనా తెగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంభీరావుపేట, డిసెంబర్ 10: ముదిరాజ్‌ల హక్కుల సాధనకై ఎంతకైనా తెగించడానికి సిద్దంగా వున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు తెలిపారు. సోమవారం మధ్యహ్నం గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామంలో నిర్వహించిన ముదిరాజ్‌ల బహిరంగసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాటాలు, త్యాగాలు ముదిరాజ్‌ల కొత్త కాదని వంశపారంపర్యంగా వస్తున్నాయన్నారు. ఇంత కాలం ముదిరాజ్‌లు అగ్రవర్ణాలకు జిందాబాద్‌లు కొట్టి, జెండాలు మోసిన పాలకులు మాత్రం ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి మాత్రం ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం టీఆర్‌ఎస్ ఒక్కటి, మహాకూటమి రెండు, టీడీపీ ఒక్కటి మాత్రమే ముదిరాజ్‌లకు టీక్కెట్ కేటాయించి తీవ్ర అన్యాయానికి గురిచేసిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోనైన ముదిరాజ్‌లు ఐక్యత ప్రదర్శించి మెజార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అగ్రవర్ణాలన్ని ఎన్నికలలో ఒక్కటవుతున్నాయని, వారిని చూసైన ముదిరాజ్‌లు నేర్చుకోవాలన్నారు. రాష్ట్రంలో 14శాతంలో అతి పెద్ద జనాభా కల్గిన కులం ముదిరాజ్‌లయితే, అందులో రాజ్యాధికారం వాటా మాత్రం అర శాతమేనని గుర్తుచేశారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి ముదిరాజ్‌లను మోసం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటివరకు ముదిరాజ్‌ల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడన్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తంచేశారు. ముదిరాజ్‌ల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వుందని గత కాంగ్రెస్ ప్రభుత్వం కాని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాని చిత్తశుద్దితో కృషిచేయక నాన్చివేత దోరణి అవలంభించిందని మండిపడ్డారు. వచ్చే కొత్త ప్రభుత్వమైన ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పెద్దపిడుగు శంకరయ్య, మండల శాఖ అధ్యక్షుడు ఓరుగంటి నర్సింలు, నాయకులు శాత్రబోయిన లక్ష్మణ్, శ్రీనివాస్, అరిగే రమేశ్, జెల్ల శంకర్, రవి, నాగారపు దేవేందర్, శ్రీనివాస్, దేవరాజ్, తిరుపతి, అంజనేయులుతో పాటు పలువురు పాల్గొన్నారు.