కరీంనగర్

జగిత్యాలలో ఎగిరిన గులాబీ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 11: జగిత్యాల పోరుగడ్డ జగిత్యాల జైత్రయాత్ర సాక్షిగా గులాబీజెండా జగిత్యాలలో ఎగసిపడింది. రాష్టవ్య్రాప్తంగా మంగళవారం వెలువడిన శాసనసభ ఫలితాల్లో మొట్టమొదటగా జగిత్యాలలో గులాబీ జెండా ఫలితం వెలువడి అధిక్యతను ప్రదర్శించింది. జగిత్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రాజకీయ ఉద్ధండుడు, మాజీ సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ సంజయ్‌కుమార్ 61,185 ఓట్లతో గెలుపొంది రికార్డు సృష్టించారు. నియోజకవర్గంలో 1,59,740 ఓట్లు పోలవ్వగా జీవన్‌రెడ్డికి 43,062, టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు 104247 ఓట్లు రాగా 61,185 ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి సంజయ్‌కుమార్‌కు ధృవీకరణ పత్రం అందజేశారు.జగిత్యాల పట్టణంలోని వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలలో జగిత్యాల సెగ్మెంట్ లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుండి లెక్కింపును ప్రారంభించగా 10.30 గంటల వరకు పూర్త్ఫిలితాలను వెలువరించి సంజయ్‌కుమార్ గెలిచినట్లుగా ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా మొదటి ఫలితం జగిత్యాలదేనని అధికారులు పేర్కొన్నారు. మొదటి రౌండు నుండి 13 రౌండ్ల వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్ ఎక్కడా వెనుదిరిగి చూడకుండా అప్రతిహతంగా దూసుకువెళ్తూ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓటర్లు ఎక్కడా కూడా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డికి అవకాశం ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరించినట్లు ఎన్నికల ఫలితాల్లో తెటతేల్లమైయ్యాయి. బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్‌రెడ్డి ఏ రౌండులోనూ 500ల కన్నా ఎక్కువగా ఓట్లు సాధించలేదు. కేవలం 4,817 ఓట్లతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ప్రతి రౌండులోనూ ప్రత్యర్థి జీవన్‌రెడ్డికన్నా రెట్టింపు ఓట్లతో సంజయ్‌కుమార్ ఓట్ల అధిక్యత సాధిస్తూ మెజార్టీ ఓట్ల వైపు దూసుకువెళ్లారు. తుది ఫలితాల్లో భారీ మెజార్టీ సాధించి విజయాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ కైవసం చేసుకున్నారు.