కరీంనగర్

ప్రజల అప్యాయతను మర్చిపోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు చూపిన అప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని నా విజయం ప్రజల విజయంగా భావిస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. తన గెలుపును జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డబ్బులు పంచారని ఆరోపించడం సరికాదని అన్నారు. ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ అయిందని పేర్కొనడం అవివేకమని మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ప్రజాబలం ముందు ధనబలం ఎప్పటికీ పనిచేయదని అన్నారు.
కోరుట్ల అభివృద్ధికి అంకితమవుతా..
- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
కోరుట్ల, డిసెంబర్ 18: కోరుట్ల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుట్ల డివిజన్ కోసం కొంత మంది నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే పుకార్లు లేపారని వారి మాటలు పట్టించుకోకుండా తనను గెలిపించిన పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సారెస్పీ క్యాంపులో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని సేకరించామన్నారు. అలాగే పట్టణంలో 100 పడకల ఆసుపత్రి సంవత్సరంలోగా పూర్తిచేసేందుకు ఎంపీ కవిత సహకరిస్తారని అన్నారు. బ్లడ్‌బ్యాంకును సైతం ఏర్పాటు చేస్తామని, ఆసుపత్రిలో సిబ్బంది ఖాళీలను నింపుతామని, కోరుట్ల తనకు వాస్తుపరంగా కలిసొచ్చిందని కోరుట్ల ప్రజల అభివృద్ధికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటానని బూటకపు మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు.

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
- ఈసీ నాగిరెడ్డి ఆదేశం

కరీంనగర్, డిసెంబర్ 18: జనవరి 2, 2019 తరువాత విడుదల కానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ వి.నాగిరెడ్డి జిల్లాల కలెక్టర్లకు సూచించారు. మంగళవారం రాష్ట్ర కమీషనర్ వి.నాగిరెడ్డి, కార్యదర్శి అశోక్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని, ఇప్పటికీ తయారు చేసిన జాబితాలను సరి చూసుకోవాలని ఎన్నికల సంఘం కమీషనర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోలింగ్‌కు అవసరమైన సామాగ్రి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 2019 జనవరి 2వ తేదీ తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని, ఆ లోపే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఎన్నికల సంఘం కమీషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇప్పటికే బ్యాలట్ పత్రాలు సిద్ధం చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్‌కు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

నారసింహుని కృపతోనే రాష్ట్రం సుభిక్షం
- ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, డిసెంబర్ 18: నారసింహుని కరుణా కటాక్షాలు, కృప వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నదని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మపురి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలలో పాల్గొన్న కొప్పుల మాట్లాడుతూ, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కంకణధారియైన కేసిఆర్‌కు ధర్మపురి లక్ష్మీ నారసింహుని దీవనలు ఉండాలని, ఆయనకు ధైర్యం, స్థ్యైర్యం, సేవానిరతిని కల్పించాలని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొసాగాలని, సుభిక్షంగా ఉండాలని స్థానిక దైవాన్ని కోరుకున్నామన్నారు. ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరైనారని, కమిటి, అధికారులు, అర్చకులు, సిబ్బంది, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారని అభినందించారు. ధర్మపురి నారసింహుడు కోరిన కోర్కెలు ఈడేర్చే దైవమని, సకల మానవులకు మేలు జరగాలని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిగి సిఎం కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ధర్మపురికి 50కోట్లు గత బడ్జెట్‌లో కెటాయించారన్నారు. ముక్కోటి ఉత్సవాలకు పాలకవర్గం, ఇఓ, సిబ్బంది, అర్చకులు చేసిన ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయన్నారు. దేవస్థానం ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, కమిటీ బాధ్యులు, ధర్మపురి జడ్పిటిసి రాజమణి, ఎంపీపీ మమతారావు, వైస్ ఎంపీపీ రాజేశ్, తదితరులున్నారు.