కరీంనగర్

హరితహారం కోసం గ్రీన్ ఆర్మీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 13: తెలంగాణ హరితహారం పథకంలో భాగంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటేందుకు గ్రామాల్లోని ప్రజలతో గ్రీన్ ఆర్మీని ఏర్పాటుచేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు.హరితహారంలో మొక్కలు నాటేందుకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, క్వారీయజమానులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు,ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్ళతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. నాటిన ప్రతిమొక్కను సంరక్షించాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నర్సరీల్లో పలురకాల మొక్కలు పెంచుతున్నామని, అవసరమైన వాటిని ప్రజలు తీసుకెళ్లి నాటాలన్నారు. మండలాల్లో ఎంపిడివో నుంచి గ్రామసర్పంచ్, కార్యదర్శి ఎవరు సిఫారసు చేసినా నర్సరీల్లోని మొక్కలను ప్రజలకు అందజేయనున్నట్లు, అన్ని చోట్ల పెంచుతున్న మొక్కల వివరాలను కరపత్రాలు, పోస్టర్లు ముద్రించి ప్రజలు తెల్సుకునే విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులనాదేశించారు. జిల్లాలోని రోడ్లు భవనాలశాఖ, పంచాయితీరాజ్‌శాఖ రోడ్లకు ఇరువైపులా భారీ ఎత్తున మొక్కలు నాటించాలని ఆదేశించారు. రోడ్డు కాంట్రాక్టర్లతో జెసిబిల ద్వారా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటేందుకు వీలుగా కందకాలు తీయించాలని, రామగుండం నుంచి హైద్రాబాద్ రాజీవ్హ్రదారికి ఇరువైపులా జిల్లా పరిధిలోమొక్కలు నాటించాలని కో ఆర్డినేటర్‌కు సూచించారు.హరితహారం విజయవంతానికి యువజన సంఘాల సభ్యులు సంపూర్ణ సహాయసహాకారాలు అందించాలని కోరారు. యువ చైతన్య గ్రూపులతో గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటించాలన్నారు. ఇళ్ళలో పండ్లు, పూలమొక్కలు నాటుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ట్రైసైకిళ్ళ ద్వారా సర్పంచ్‌లు మొక్కలను నీళ్ళుపోసి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని, పంచాయితీల్లో అందుబాటులో ఉన్న నిధులనుంచి వీటిని తెచ్చుకోవాలన్నారు. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో పునరుద్దరించిన చెరువుల్లో మొక్కలు నాటాలని, చెరువులకు సామాజిక అడవుల విభాగం అటవీశాఖాధికారి, ఇరిగేషన్ ఇంజనీర్లతో కలిసి సంయుక్త తనిఖీలు చేయాలని, ఇందుకు షెడ్యూల్ కూడా తయారుచేయాలన్నారు. మండలానికి ఒక పెద్ద చెరువును గుర్తించి అందులో అటవీశాఖ ద్వారా తాటి, ఈత, ఖర్జూర, ఇతర మొక్కలు నాటించాలని, మిగిలిన చెరువులను సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు గౌడ, ఇతర సంఘాల ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు బాధ్యతలు అప్పగించాలన్నారు. రోడ్ల వెంట నాటిన మొక్కనలు రక్షించేందుకు దాతల నుంచి ట్రీగార్డులను సేకరించాలని, అంధ్రాబ్యాంకు యాజమాన్యం 1000 ట్రీగార్డులు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్, క్వారీ యజమానులు ట్రీగార్డులు సమకూర్చాలని కోరారు. ఈసమావేశంలో డి ఎఫ్‌వోలు రవికిరణ్, మహేందర్‌రాజు, అసిస్టెంట్ కలెక్టర్ గౌతం, డ్వామా పిడి వైవి గణేశ్, లీడ్‌బ్యాంక్ మేనేజర్ చౌదరి,పి ఆర్ ఎస్ ఈ దశరథం, ఆర్ అండ్ బి ఈ ఈ రాఘవాచారి, స్టెప్‌కార్ సి ఈవో అలీ, యువజన సంఘాల నాయకులు సత్తినేని శ్రీనివాస్, కొండ రవి, వలస సుభాష్, శోభారాణి, శంకర్ పాల్గొన్నారు.