కరీంనగర్

నిబంధనలకు బల్దియా సిబ్బంది నీళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 13: నగరంలో నిత్యం పెరుగుతున్న జనాభాకనుగుణంగా రహదారులను కూడా అదేస్థాయిలో పెంచాలనే ఉద్దేశంతో చేపట్టిన రోడ్డువెడల్పు కార్యక్రమంలో పేదోడి గూడును కూడా తొలగిస్తున్న బల్దియా అవే దారులపై ఏళ్ళ తరబడి తిష్టవేసి, వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న వారి వాణిజ్యసామాగ్రిని మాత్రం ముట్టుకోవటంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకేంద్రమైన నగరంలో నిత్యం లక్షలాదిమంది వచ్చిపోయే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రధానరహదారులతో పాటు అనుబంధ వీధులపై నిర్వహించే వ్యాపార లావాదేవీలను నగరపాలకసంస్థ అధికారులు నిషేధించారు. ఇందులోభాగంగా బల్దియా సిబ్బంది నిత్యం తనిఖీలు చేపడుతూ చిరువ్యాపారులను సైతం రోడ్డెక్కకుండా కట్టడి చేస్తున్నారు. అయితే, రహదారులనానుకుని దుకాణాలు నెలకొల్పిన వ్యాపారులు తాము వినియోగించే సామాగ్రికి రోడ్డునే అడ్డాగా మారుస్తున్నా వాటివైపు మాత్రం కనె్నత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా హోటళ్ళు, ఇంజనీరింగ్ దుకాణాలు, ఫంక్షన్‌హాళ్ళు, షాపింగ్ మాళ్ళు వినియోగిస్తున్న జనరేటర్లు, వీటిలోకి వచ్చిపోయే వినియోగదారుల వాహనాల కోసం ఏర్పాటచేస్తున్న పార్కింగ్ స్థలాలు మొత్తం రహదారులనాక్రమించేస్తున్నాయి. అత్యధికంగా కమాన్‌చౌరస్థా, టవర్‌సర్కిల్ ప్రాంతం, రాజీవ్‌చౌక్,గీతాభవన్ చౌరస్థా, పొన్నం కాంప్లెక్స్ ప్రాంతం, కోర్టు చౌరస్థా, పాపారావుమాల్,మంచిర్యాల చౌరస్థాల్లో కూడా రహదారులనానుకుని వ్యాపారుల సామాగ్రి తిష్టవేయటం సర్వసాధారణంగా మారింది. దీంతోట్రాఫిక్ సమస్యలు కూడా నిత్యం తలెత్తుతున్నాయి. రహదారుల వెడల్పుపనులకు కూడా అడ్డంకిగా మారుతున్నాయి.వీటిని పరిష్కరించేందుకు విధినిర్వహణలో ఉండే ట్రాఫిక్ సిబ్బంది తలప్రాణం తొకకొస్తుండగా, వాగ్వివాదాలు షరామామూలే అన్నట్లుగా మారాయి. ఇంతజరుగుతున్నా..కుటుంబపోషణ కోసం పేవ్‌మెంట్లపై అమ్మకాలు చేపట్టే చిరువ్యాపారులపై ఉక్కుపాదం మోపే సిబ్బంది, ఆపక్కనే ఉండే స్థలాలు కబ్జాచేసి వాణిజ్యసామాగ్రి నిల్వపెట్టే బడావ్యాపారులపట్ల ఉదాసీన వైఖరి అవలంభించటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారులపై పార్కింగ్, డిస్‌ప్లేలపట్ల ట్రాఫిక్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా, బల్దియా సిబ్బందితీరుతో అవి బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కిందిస్థాయి అధికారులపనితీరుపై చిన్న,మద్యతరగతి వ్యాపారుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటుండగా, మేయర్, కమిషనర్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.