కరీంనగర్

సిబిఎఫ్ పనులు సత్వరమే పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 13: క్రూసియల్ బ్యాలెన్స్‌ఫండ్ కింద గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు సత్వరమే పూర్తిచేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సిబిఎఫ్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, వ్యవాసయ గోడౌన్లు, విద్యాసంస్థల ప్రహరీగోడలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు సిబిఎఫ్ కింద చేపట్టినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 177 పనులు చేపట్టగా, ఇప్పటివరకు 77 పనులు పూరె్తైనట్లు, మిగతా వంద పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.500.89లక్షల అంచనాలతో పనులు చేపట్టగా ఇప్పటివరకు రూ.339.90 లక్షలు విడుదల చేసినట్లు వివరించారు. పనులు పూర్తికాక స్థల సమస్యలు ఉన్నచోట రద్దుచేసి, స్థల లభ్యత ఉన్నచోట పనులు మార్చాలని, భవనాలు లేని జిపిలు, శిథిలావస్థలో ఉన్న జిపిల స్థానంలో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల వసతి, తాగునీటి సౌకర్యం కల్పించాలని, మోడల్‌స్కూళ్ళలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లు వినియోగంలోకి తెచ్చిన మీదటనే నిధులు చెల్లించాలన్నారు. 201617 ఆర్థిక సంవత్సరానికి నూతన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉన్నందున గత సంవత్సర పనులపై వ్యక్తిగత శ్రద్ద వహించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈసమావేశంలో డిఆర్‌వో వీరబ్రహ్మయ్య, డ్వామా పిడి వైవి గణేశ్, డి ఆర్‌డిఏ పిడి అరుణశ్రీ, పంచాయితీరాజ్ ఎస్‌ఈ దశరథం, డిసివో అంబయ్య, పలువిభాగాల అధికారులు పాల్గొన్నారు.