కరీంనగర్

అధికారులు అంకితభావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మే 19: ప్రభుత్వ అధికారులు అంకితభావంతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపిపి తిప్పని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సంపూర్ణ అక్షరాస్యత, హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటి పన్నుల బిల్లుల చెల్లించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని, ప్రత్యేక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేశారు. చందుర్తి మండల సమస్యలను ఎంపిపి శ్రీనివాస్, జడ్పీచైర్ పర్సన్ దృష్టికి తీసుకవెళ్లగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. అనంతరం చందుర్తి మండలాన్ని కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని మండల సభలో తీర్మాణం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సిహెచ్.రాజేశ్వర్ రావుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి అంబటి గంగాధర్, ఎంపిడిఓ నాగరాజు, తహశీల్దార్ రవీంద్రచారి, డిఆర్ ఎఇ లక్ష్మిరాజంతో పాటు పలు శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.