కరీంనగర్

రాయపట్నం వంతెనను త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మే 19: కరీంనగర్ - ఆదిలాబాద్ జిల్లాలను అనుసంధాన పరిచే మండలంలోని రాయపట్నం వంతెన నిర్మాణ పనులను త్వరిత గతిన, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. గురువారం వేరు వేరుగా వంతెన నిర్మాణ పనులను స్థల పరిశీలన జరిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లంపెల్లి ప్రాజెక్టు పూర్తి అయి, గేట్లు అమర్చడం వల్ల రాయపట్నం లోలెవల్ బ్రిడ్జి బ్యాక్ వాటర్‌తో నీట మునిగిపోతోందన్నారు. ఇప్పటికే అగ్రిమెంట్ ప్రకారం ఆలస్యమైనందున ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 7.5 టిఎంసిల నీటిని రిజర్వు చేయడం నేపథ్యంలో వంతెన మునిగిపోతే రెండు జిల్లాల మధ్య రాకపోకలుండవని వారన్నారు. జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, నేషనల్ హైవే సంబంధిత ఇఇ రవీందర్, డిఇఇ జగదీశ్, కాంట్రాక్టర్ సుబ్రమణ్యం, తహశీల్‌దార్ మహేశ్వర్, ఎంపిడిఓ శశికళ, ఆర్‌ఐలు శరత్, గంగాధర్, విఆర్‌వో సత్తయ్య, ఎంపిపి మమత, వైస్ ఎంపిపి రాజేశ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, ఆమజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపిటిసి మొండయ్య, సర్పంచ్ తిరుపతి పాల్గొన్నారు.