కరీంనగర్

పరిహారంపై పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మే 19: మెదక్ జిల్లాలో నిర్మాణం కాబోతున్న మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల బాధితులు పరిహారం, సౌకర్యాల వివరాలను పూర్తి స్థాయిగా తెలుసుకునేందుకు కరీంనగర్ జిల్లా రామగుండం మండలం గోదావరి నదిపై నిర్మాణం జరిగిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలతో గురువారం సమావేశమయ్యారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న కిష్టాపూర్, బంజర్‌పల్లి, తొక్కాపూర్, ఎర్రవెల్లితోపాటు పలు గ్రామాలు ముంపుకు గురవుతుండగా అక్కడ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతున్న పరిహారం చెల్లింపుల విషయాలపై అనుమానం వచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు గత ప్రభుత్వాలు చెల్లించిన పరిహారం విషయాలను సేకరించేందుకు ఇక్కడికి వచ్చారు. బాధిత కుటుంబాలతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది బాధితులు ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ పార్టీల నాయకత్వంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాలైన మూర్మూర్, ఎల్లంపల్లి పునరావాస కాలనీలో వాడవాడ తిరుగుతూ వివరాలను తెలుసుకున్నారు. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు సకల సౌకర్యాలతో పునరావాసం కల్పించడంతోపాటు రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి సౌకర్యం ఇతరత్రా సౌకర్యాలన్నింటినీ కల్పించిన విషయాలను స్థానిక నేతలు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ బాధితులకు వివరించారు. మల్లన్న సాగర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయదన్న విషయాలు తెలుసుకున్నాక ఇక్కడికి చేరుకొని వివరాలన్నింటినీ ఆరా తీస్తున్నారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సౌకర్యాలు, ఎకరాకు చెల్లించిన పరిహారం, ఒక కుటుంబంలో 18 ఏళ్లు నిండిన యువకులందరినీ యూనిట్‌గా గుర్తించి చెల్లించిన పరిహారం, ఇతరత్రా వివరాలన్నింటిని తెలుసుకున్నారు. మెరుగైన ప్యాకేజీ చెల్లింపుల కోసమే ముందస్తుగా ఎల్లంపల్లి ముంపు గ్రామాన్ని సందర్శించామని, భూములు కొల్పోతున్న బాధిత కుటుంబాలకు సర్కార్ నుంచి ఏమాత్రం అన్యాయం జరగకుండా చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు వివిధ రాజకీయ పార్టీల నేతలు స్పష్టం చేశారు. మెరుగైన ప్యాకేజీ కోసం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో అఖిలపక్ష నేతలతో పెద్ద ఎత్తున సమావేశాన్ని చేపట్టనున్నామని, అందుకే ముందస్తుగా ముంపు గ్రామంలో పర్యటిస్తామని, ఇక్కడి రావడం వల్ల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు ఏ మేరకు పరిహారం చెల్లింపులు జరుగుతాయో.. నిర్వాసితులకు న్యాయ పరంగా, జిఓ ప్రకారంగా తీసుకోవాల్సిన హక్కులు, కల్పించాల్సిన సౌకర్యాలు, వౌలిక వసతుల విషయాలపై పోరాటం చేసి సాధించుకునేందుకే ఇక్కడ ముంపు గ్రామాన్ని సందర్శించినట్లు బాధితులు పేర్కొన్నారు.