కరీంనగర్

జయహో హనుమా.. జయ జయహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, మే 31: జయహో హనుమా.. జయ జయహో హనుమా.. రామదూత హనుమాన్‌కీ జైభోలో శ్రీరామ్‌కీ అంటూ హనుమాన్ హనుమాన్ నామకీర్తనలతో కొండగట్టు అంజన్న జయంతి తరలివచ్చిన కాషాయదండు వేడుకలు మారుమ్రోగాయి. ఉదయం నుండి రాత్రి వరకు అంజన్న జయంతి వేడుకల్లో 80వేలకు పైగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైశాఖమాస అష్టమి నుండి దశమి వరకు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు శ్రీ వైష్ణవ అగమశాస్త్రానుసారంగా జరిగిన ఈ వేడుకలకు ఆంజనేయస్వామి అనుగ్రహం కోసం నవగ్రహాల దోషనివారణ కోసం వివిధ రకాల కోరికల కోసం 11, 21, 41 రోజుల పాటు మాలధారణ చేపట్టిన భక్తులు నలుజిల్లాల నుండి వాహనాల్లో కాలినడకన అంజన్న జయంతి కోసం తరలిరావడంతో చెట్టు గుట్ట ఘాట్‌రోడ్డు కొండగట్టు పరిసర ప్రాంతాలు కాషాయ రంగుతో అలుముకుంది. సోమవారం రాత్రి నుండి ప్రారంభమైనా భక్తుల రద్దీ మంగళవారం రాత్రి వరకు నిరంతరం ఆలయంలో స్వామివారిని దర్శనం కొనసాగింది. అలాగే ఆలయ అర్చకులు స్వామివారి యాగశాలలో ఉదయం నుండి రాత్రి వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు పూజాదులు ఘనంగా జరిగాయి. హనుమాన్ మాలదీక్ష చేపట్టిన భక్తులకు కల్యాణకట్టా, మాల విరమణ, కోనేటిస్నానాలు, స్వామివారి దర్శనం నిర్విరామంగా కొనసాగాయి. జగిత్యాల సబ్‌కలెక్టర్ శశాంక్ మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మంచినీటి కొరత లేకుండా అధికారులకు మార్గదర్శకాలు సూచించడం వల్ల గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులు నీటి కోసం వెంపర్లాడే దుస్థితి రాలేదు. ఓఎస్‌డి సుబ్బారాయుడు, డిఎస్పీ రాజేంద్రప్రసాద్‌లు భారీ ఎత్తున పోలీసు బలగాలను దింపి ట్రాఫిక్‌ను నియంత్రణలో సఫలమయ్యారు. పోలీసులు భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు తెలుపుతూ దర్శనానికి మార్గదర్శకులుగా నిలిచారు. మల్యాల పిహెచ్‌సి వైద్యురాలు స్వప్నలత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రథమ చికిత్సతో పాటు ఎండదెబ్బకు నిరసించిపోయిన వృద్ధులకు గ్లూకోజ్ పెట్టి ఆదుకున్నారు. లడ్డు పులిహోర కేంద్రాల వద్ద ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో ఆలయ ఈవో సఫలికృతుడైయ్యారు. హైదరాబాద్‌కు చెందిన కాంతి తేజ ఎజెన్సీ నిర్వహకుడు శ్రీ్ధర్ అన్నదానంతో పాటు అల్పాహారం, ప్యూరిఫైడ్ వాటర్ బాటిళ్లను సరఫరా చేసి భక్తుల మన్నల పొందారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా మజ్జిగను భక్తులకు కావాల్సినంతా సరఫరా చేసి మండుటెండలో భక్తుల దాహార్తికి ఉపశమనం కల్పించారు. కొండగట్టులో అన్ని ఏర్పాట్లు ఆనందదాయకం కాగా వ్యాపారస్థులు అధిక రేట్లకు విక్రయించడంతో భక్తులు అవాక్కయ్యారు. అలాగే కళ్యాణ కట్టా వద్ద నారుూ బ్రహ్మణులు, మాల విరమణ కేంద్రంలో అర్చకులు తల రూ.50 వసూలు చేయడం లక్షల్లో అక్రమ ఆదాయానికి పాల్పడ్డారని భక్తులు ఆరోపించారు. భక్తులు పలువురు అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.