కరీంనగర్

మహిళా హోంగార్డుకు ‘వైట్ కాలర్’ టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తారం, జూన్ 17: హలో... నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అకౌంట్ సెక్యూరిటీలో లోపం ఉంది. కాస్త ఎటిఎం నెంబర్, పాస్‌వర్డ్ చెప్పండి. సరి చేస్తానంటూ... ఓ మహిళా హోంగార్డుకు ఫోన్ చేసిన ఓ వైట్ కాలర్ నేరగాడు క్షణాల్లోనే తన ఖాతాను నుంచి 15వేల రూపాయలను ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా డ్రా చేసిన సంఘటన ముత్తారం మండలంలో చోటు చేసుకుంది. ముత్తారం పోలీసు స్టేషన్‌లో విజయ అనే మహిళ హోంగార్డుగా విధులు నిర్వహిస్తుంది. తను విధుల్లో ఉండగా శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ కాల్ వచ్చిన్నట్లు తెలిసింది. హలో మేడం మేం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం... అకౌంట్ సెక్యూరిటీలో లోపాలున్నాయి. మీ ఎటిఎం నెంబరు, పాస్ వార్డు చెప్పండి సరి చేస్తామంటూ అడిగినట్లు తెలిసింది. దీంతో ఎటిఎం వివరాలను చెప్పి ఫోన్ కట్ చేయగా, ఇది జరిగిన రెండు, మూడు నిమిషాల్లో ఖాతా నుంచి 15వేల రూపాయలు డ్రా చేసినట్లుగా మేసేజ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న విజయ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయ్యాయని లబొదిబొమంటూ సదరు మంథనిలోని బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే తన ఖాతాను స్తంభింపజేయాలని కోరింది. స్పందించిన సదరు బ్యాంక్ మేనేజర్ వివి.సత్యనారాయణ ఆమె ఖాతాను స్తంభింపజేసినట్లు తెలిపారు.