కరీంనగర్

రాజాద్రి వైపు అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూన్ 17: దసరా నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త మండలాల ఏర్పాటుపై జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం కరీంనగర్‌ను కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలుగా విభజించాలని ప్రాథమిక అంగీకారానికి వచ్చిన ప్రభుత్వం జిల్లాలో ఉండే మండలాల సమగ్ర స్వరూపాన్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఏయే జిల్లాలో ఏయే మండలాలు ఉండాలో సమగ్రమైన సమాచారంతో మ్యాపులను తయారు చేసి దానికి అనుగుణంగా కసరత్తు చేసింది. రాజాద్రి పేరు మీద సిరిసిల్లను జిల్లా విభజించడం ఖాయంగా మారడంతో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు జోరందుకున్నాయి. రాజాద్రి జిల్లాగా మారుతుండటంతో స్థానికంగా వౌలిక వసతుల కల్పనపై దృష్టి కేంద్రీకృతమైంది. జిల్లా పరిపాలనాధికారి భవనం, కార్యకలపాలు నిర్వహించేందుకు అనువైన భవనాల కోసం రెవెన్యూ అధికార యంత్రాంగం ఆరా తీస్తున్నారు. వేములవాడ మండలం అగ్రహారం ప్రాంతంలో డిగ్రీ, పాలిటెక్కిక్ కళాశాలు, సిరిసిల్ల-సిద్దిపేట రహదారి మధ్యలో ఉన్న ఓ ప్రైవేటు బీడీ కంపెనీ భవన సముదాయాన్ని కలెక్టరేట్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అగ్రహారం అయితే విశాలమైన కళాశాల ప్రాంగణం జిల్లా పరిపాలన కార్యాలయానికి అనువైనదిగా ఉంటుందని అధికారుల్లో ఓ అభిప్రాయం కూడా ఉంది. పరిపాలన సౌలభ్యం, మెరుగైన సేవలను అందించే విధంగా సిరిసిల్ల జిల్లా కూర్పు ఉండే విధంగా రెవెన్యూ అధికారులు మండలాల రూపకల్పన చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలకు తోడుగా మరో రెండు అర్భన్ మండలాలను, రెండు రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట మండలంలో వీర్నపల్లిని మరో మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మండలలా సంఖ్య పదిహేను వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో జిల్లా అధికారులు చర్చించి తుదిరూపం తీసుకువచ్చే అవకాశం ఉందని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయ.
పెరిగిన భూముల ధరలు
కాగా, సిరిసిల్లను జిల్లాగా చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించడంతో సిరిసిల్ల-వేములవాడ రహదారికి మధ్యలో ఉన్న భూముల ధరల విపరీతంగా పెరిగిపోయాయి. నిన్నా మొన్నటి వరకూ స్తబ్దంగా ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగి భూములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో భూములు రెట్టింపయ్యాయ. పరిసర గ్రామాల్లో ఎకరం వ్యవసాయ భూమి రూ.3లక్షల నుంచి అమాంతం రూ.10లక్షల వరకు చేరింది.