కరీంనగర్

రుణమాఫీ నిధులు వెంటనే ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 17: రైతుల రుణ మాఫీకి సంబంధించి మూడవ విడత 25 శాతం నిధులు బ్యాంకర్లకు వెంటనే ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లు కరవు ఉన్న మాట వాస్తవమేనని, ప్రభుత్వం రుణాల రీ షెడ్యూల్ చేయడం, అప్పులు చేస్తూ రైతులు ఎలాగోలా నెట్టుకొచ్చారన్నారు. ఈ సారి వర్షాలు బాగా కురువనున్న నేపథ్యంలో రైతులను రుణాల విషయంలో ఇబ్బందులకు గురిచేయవద్దని, సకాలంలో రుణాలందించాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే బలహీనవర్గాలను ఆదుకునేందుకు స్వయం ఉపాధి రుణాలను రూ.10లక్షల వరకు మంజూరు ఇస్తుందని, ఈ రుణాల్లో అర్హులైన నిరుపేదలకు అందించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం, పశువుల పెంపకం, పందుల పెంపకం, మత్స్యకారులకు రుణాలు మంజూరు చేస్తూ ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి బ్యాంకులు కృషిచేయాలని అన్నారు. పేద ప్రజలు నిజాయితీగా రుణాలను చెల్లిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లు సహకరించాలని అన్నారు. అంతకుముందు మంత్రి రాజేందర్ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రైతులకు కొత్త రుణాలను రెన్యూవల్ చేయాలని, మానవత దృక్పథంతో ఆలోచించి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. ఈసమావేశంలో కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకులు ఖరీఫ్‌లో రుణాలను మంజూరు చేయడంలో వ్యవసాయ అధికారులు సహకరిస్తారని చెప్పారు. జిల్లాలో రుణ చెల్లింపుల శాతం ఆశాజనకంగా ఉందని, 2.55శాతం మాత్రమే ఎన్‌పిఏ ఉందని అన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాల లింకేజీ రుణాలను అందించాలని కోరారు. రుణ అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు అర్హత మేరకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్‌ఆప్ ఇండియాలో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలకు రూ.10లక్షల నుంచి కోటి రూపాయల వరకు పూచీకత్తు లేకుండా అందిస్తున్నామని అన్నారు. ఈసమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, బ్యాంకర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.