కరీంనగర్

సమగ్రాభివృద్ధికి పాటుపడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 17: కరీంనగర్ నగర సమగ్రాభివృద్ధికి కార్పొరేటర్లు అందరు కలిసికట్టుగా పాటుపడాలని, అప్పుడే కరీంనగర్ స్మార్ట్ సిటిగా అవతరిస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా కార్పొరేటర్లు మారాలని సూచించారు. సిఎం కెసిఆర్ కరీంనగర్ తొలి పర్యటనలోనే నగరాన్ని లండన్, న్యూయార్క్ మాదిరిగా తయారుచేస్తామని ప్రకటించారని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నగరంలో చేపట్టే ప్రతి పని దూర దృష్టితో ఆలోచించి 30 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఉండాలని సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌లోనే నగరాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించామన్నారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తూ నగరాన్ని ఆకర్షణీయంగా మార్చాలని మంత్రి సూచించారు. ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణ్భాస్కర్ తదితరులు స్మార్ట్ సిటీ అంశంపై మాట్లాడారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.