కరీంనగర్

చినుకు.. చింత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 17: వరుసగా మూడేళ్లు కరువుతో అతలాకుతలమైన అన్నదాత ఈ సారైనా వర్షాలు కరుస్తాయనే ఆశతో ఖరీఫ్‌కు సిద్ధం కాగా, రుతు పవనాల రాకలో ఆలస్యం జరుగుతుండటంతో రైతులను చినుకు చింత వెంటాడుతోంది. వారం కిందట కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్నుకొని సిద్దంగా ఉన్న రైతులు తొలకరి వర్షాల కోసం ఆకాశానికేసి తదేకంగా చూస్తున్నారు. రెండ్రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తున్న దరిమిలా రైతుల్లో మినుకుమినుకుమంటూ ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో 5.15లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని సంబంధిత వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1.85లక్షలు, మొక్కజొన్న 83.669, పత్తి 1,62,335, పెసర 10,742, కంది 13,241, బబ్బెర 250, మిరప 3,500, మినుములు 2,243, వేరుశనగ 150, నువ్వులు 10, శనగలు 10, సోయాబీన్ 31,761, చెరుకు 1200, పసుపు 10,000, ఆముదం 50, ఇతర పంటలు 11,039 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు తగిన అంచనాలు తయారు చేశారు. 70వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు అవసముంటాయని అంచనా వేయగా, ఇందులో వరి 42వేలు, సోయాబీన్ 33వేలు, మొక్కజొన్న 14వేలు, పెసర్లు 2వేలు, కందులు 2వేలు, మినుములు 571, జము 4,300, జీలుగ 14వేలు క్వింటాళ్ల చొప్పున ఉన్నాయి. అలాగే ఈ సారి పత్తి సాగును తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. జిల్లాలో సాధారణ పత్తి సాగు 2,22,766 హెక్టార్లు కాగా, 1,62,335 హెక్టార్లకు తగ్గించారు. ఈ సాగుకోసం 9లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 50శాతం విత్తనాలు అందుబాటులో ఉంచారు. అటు ఎరువులు సైతం అందుబాటులో ఉంచడంతోపాటు నకిలీ విత్తనాలపై కూడా అధికారులు నిఘా వేశారు. ఇదిలా ఉండగా, మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులకు ఖరీఫ్ సీజన్‌లో బ్యాంకర్లు రూ.2700కోట్లు రుణాలివ్వాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే, ఎప్పటిలాగే బ్యాంకర్లు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా రుణ మాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో రుణాల విషయంలో బ్యాంకర్లు ఎప్పుడు వెనకడుగువేస్తారని, ఇప్పుడు ఏలా ఉంటుందో చూడాలంటూ రైతులు వాపోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా...వరణుడు కలవరపెడుతున్నాడు. నష్టాలు చవిచూసిన కర్షకుడు ఆశల ఖరీఫ్‌పై ఆశలు పెంచుకోగా, చినుకు జాడ కరువైంది. దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్న రైతు వర్షాల కోసం నిరీక్షిస్తున్నాడు. రెండ్రోజుల్లో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారులు ప్రకటిస్తుండటంతో రైతుల్లో మినుకుమినుకు మంటూ ఆశలు చిగురిస్తున్నాయి. వర్షాల కోసం రైతులు పూజలు చేస్తున్నారు. ఇక వరుణ దేవుడు కరుణిస్తాడో, లేదో వేచి చూడాల్సిందే మరీ.