కరీంనగర్

తెలంగాణలోనే కరీంనగర్ గుండెకాయలాంటిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానకొండూర్, జూన్ 17: రాష్ట్రంలోనే కరీంనగర్ గుండెకాయాలాంటిది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపి వినోద్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. లక్ష్మిపూర్‌లో మిషన్ కాకతీయలో భాగంగా మాదిగకుంట పనులు, పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, కుర్మ సంఘం భవనం నిర్మాణం కోసం శంకుస్థాపన, గ్రామంలో తాగునీటి కోసం 24 గంటల విద్యుత్ సరఫరా, ఊటూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని లక్ష్మిపూర్‌లో పెట్రోల్ బంకు ప్రారంభోత్సవం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, విత్తన శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన, స్ట్రాంగ్ రూం, ఇంకుడు గుంతలకు ముగ్గుపోసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సహకార రంగం విస్తరిస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల్లో పూర్వ వైభవం రావాలని, రైతుల అవసరాలకు సహకార సంఘాలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని చెప్పారు. రానున్న కాలంలో కరీంనగర్ జిల్లాలో రెండు పంటలకు సాగు నీరందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నారు. సహకార సంఘాల అభివృద్ధి సహకారం అందిస్తామన్నారు. ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాలు ఆర్థికం లాభాలు గడిస్తున్నాయన్నారు. పత్తి పంటను కొంత మేర తగ్గించాలని, ప్రపంచ మార్కెట్‌లో మద్దతు ధరలేని నేపథ్యంలో పత్తి సాగు తగ్గించాలని రైతులకు సూచించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు కూలీ బిడ్డగా సేవలు అందిస్తానన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ ఇప్పటి వరకు 12 సంఘాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని, 127 సంఘాలు లాభాల్లో నడుస్తున్నాయన్నారు. రానున్న కాలంలో జిల్లాలో 162 మైక్రో ఎటిఎంలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఎంపిపి మాతంగి లింగయ్య, జడ్పీటిసి ఎడ్ల సుగుణాకర్, ఊటూర్ సొసైటీ చైర్మన్ ముద్దసాని ప్రదీప్‌రెడ్డి, సర్పంచ్ ఎడ్ల పుష్పలత, వైస్ ఎంపిపి దేవ సతీష్‌రెడ్డి, గర్రెపల్లి సొసైటీ చైర్మన్ కల్లెపల్లి జానీ, ఎంపిటిసి పడాల లక్ష్మి, సర్పంచ్‌లు ముద్దసాని శ్రీ్ధర్‌రెడ్డి, తుమ్మల సుజాత, సదానందం, గోపు నర్సింహారెడ్డి, పాలక వర్గ సభ్యులు రైతులు తదితరలు పాల్గొన్నారు.