కరీంనగర్

పోలీసుల నిరీక్షణకు మోక్షం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 21: జిల్లా పోలీసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారంతపు (వీక్లిఆఫ్) సెలవు నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జిల్లా పోలీసులకు వారంతపు సెలవు అమలు చేసేందుకు ఎస్పీ శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పోలీసులకు వీక్లిఆఫ్ విధానం అమలుకానుంది. ప్రతి ఉద్యోగి వారంతపు సెలవులను వినియోగించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. పోలీసులు మాత్రం 365రోజులు విధులను నిర్వహిస్తూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు లోనుకావడమే కాకుండా అనారోగ్యాల పాలవుతున్నారు. మరికొందరు కుటుంబాలకు దూరమై సంబంధ బాంధవ్యాలను కోల్పోతున్నారు. రేయింబవళ్లు ఒత్తిడిలకు లోనై అలుపెరగకుండా విధులను నిర్వహించడం వల్ల రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పుల, అజీర్ణం వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు వీక్లిఆఫ్ మంజూరుకు విధివిధానాలను రూపొంచడంతోపాటు జిల్లాలో అమలు చేయబోతున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ డి.జోయల్‌డేవిస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వీక్లిఆఫ్ వివరాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ప్రతి ఏడుగురు పోలీసుల్లో ఒకరు వీక్లిఆఫ్ వినియోగించుకోవాలని, ఒకవేళ సిబ్బంది సెలవుల్లో వెళ్లినట్లయితే వారు వచ్చిన తరువాత మిగితా వారు వీక్లిఆఫ్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కోర్టు విధులను నిర్వహించే పోలీసులు పబ్లిక్ హాలీడేను వినియోగించుకోవాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో షిప్ట్ డ్యూటీలను నిర్వహించే పోలీసులకు వీక్లిఆఫ్ వర్తించదని, అదే పోలీసు స్టేషన్‌లో ఐడి, బ్లూకోర్ట్స్, రైటర్లుగా విధులు నిర్వహించే పోలీసులు వీక్లిఆఫ్ వినియోగించుకోవచ్చని అన్నారు. వీక్లిఆఫ్ వినియోగించుకునే వారు ఆ రోజు ఉదయం రూల్‌కాల్ నుండి మరుసటి రోజు ఉదయం రూల్‌కాల్ వరకు వినియోగించుకోవచ్చని వివరించారు. సాధారణ సెలవు, వీక్లిఆఫ్ కలిపి వినియోగించుకోకూడదని, వీక్లిఆఫ్ వినియోగించుకునే వారి వివరాలను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారి ప్రతి శనివారం వారంలో వీక్లిఆఫ్ వినియోగించుకునే వివరాలను నిర్ణయించాలని అన్నారు. ఆ వివరాలను శనివారం రాత్రి 12గంటలలోపు కరీంనగర్ పోలీసు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, లేకపోతే వీక్లిఆఫ్ అర్హత లభించదని అన్నారు. ఎస్‌ఐ, సిఐ, ఎస్‌హెచ్‌ఓల వీక్లిఆఫ్‌లు సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారి నిర్ణయించాలని, వీక్లిఆఫ్‌లో వెళ్లే అధికారి తన తరువాత విధులను నిర్వహించాల్సిన ఉన్న అధికారికి ముందురోజే సమాచారం అందించాలని అన్నారు. వీక్లిఆఫ్‌లో వెళ్లే ఎస్‌ఐ, సిఐ, ఎస్‌హెచ్‌ఓ సంబంధించిన సమాచారం జనరల్ డైరీలో నమోదు చేయాలని వివరించారు. నేటి నుంచి వారంతపు సెలవు అమలు కానుందని, ఈ విధానం వల్ల జిల్లాలోని 4వేల మంది పోలీసులకు ప్రయోజనం చేకూరుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ టి.అన్నపూర్ణ, గోదావరిఖని ఎఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. కాగా, వీక్లిఆఫ్ అమలు చేయడం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.