కరీంనగర్

ప్రజారంజక ప్రభుత్వం మాది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, జూలై 5: ఉద్యమాల పార్టీగా 15 ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలను దగ్గర నుంచి చూసి వారి ఆశయాల మేరకే పనిచేసే ప్రభుత్వం మాదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళశారం పట్టణంలో రూ.28కోట్లతో మూలవాగుపై నిర్మిస్తున్న రెండు బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయన తర్వాత ప్రస్తుత పాత వంతెనను పాదచారుల రాకపోకల కోసం వినియోగిస్తామన్నారు. కొత్తగా నిర్మిస్తోన్న బౌస్ట్రింగ్ బ్రిడ్జిలను వాహనాల రాకపోకల కోసం వినియోగిస్తామని చెప్పారు. రూ.300 కోట్లతో జిల్లాలో 46 హైలెవల్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ మేనిఫెస్టోలో పెట్టిన, పెట్టని హామీలను నెరవేర్చుతూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారన్నారు. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూపి ఓర్వలేక ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోడానికి ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. మేడిగడ్డ, కాశేశ్వరం వద్ద గోదావరి బ్రిడ్జిలను నిర్మిస్తామని చెప్పారు.
పథకాల అమలుకు నిధులు పుష్కలం: ఈటల
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులకు, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వ ఖజానాలో పుష్కలంగా నిధులు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 60 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కేవలం రెండేళ్ల కాలంలో శరవేగం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 1800 కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ జరిగిందని తెలిపారు. రెండువేల కోట్లతో జిల్లాలో రహదారుల నిర్మాణం జరిగాయని, అంతేకాకుండా మరో రూ.700 కోట్లతో పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణం జరిగిందని తెలిపారు.